📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Andhra Pradesh: ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు

Author Icon By Tejaswini Y
Updated: November 10, 2025 • 10:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh) డ్రైవింగ్ లైసెన్సుల జారీ విధానంలో కీలక మార్పులు చేపట్టింది. సరైన శిక్షణ లేకుండా లైసెన్స్ పొందడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని గుర్తించిన రవాణా శాఖ, ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ఆధారంగా సంస్కరణలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 53 డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లు, 5 ప్రాంతీయ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ సెంటర్లలో శిక్షణ పూర్తిచేసిన వారికి ఇకపై ఆర్టీఏ కార్యాలయంలో డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.

శిక్షణ సర్టిఫికెట్ ఆధారంగా నేరుగా లైసెన్స్ జారీ అవుతుంది. రెండు చక్రాలు, నాలుగు చక్రాలు, భారీ వాహనాల డ్రైవింగ్‌కు సంబంధించిన ప్రాక్టికల్ శిక్షణ, రోడ్డు భద్రతా నియమాలు, సిమ్యులేటర్ ప్రాక్టీస్ వంటి అంశాలు ఇందులో భాగంగా ఉంటాయి.

Read Also: AP Cabinet: ఈరోజు ఏపీ కేబినెట్‌ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చలు

ఆర్‌డీటీసీల్లో నేరుగా లైసెన్స్ జారీ

ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న ఆర్‌డీటీసీల్లో లైసెన్స్ నేరుగా పొందే అవకాశం ఉంటుంది. ప్రతి డీటీసీ ఏర్పాటుకు కనీసం రెండు ఎకరాల భూమి అవసరమవుతుండగా, కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యయంలో 85 శాతం (గరిష్ఠంగా రూ.2.5 కోట్లు) ఆర్థిక సాయం అందిస్తుంది. ఆర్‌డీటీసీ కోసం మూడు ఎకరాల భూమి అవసరం కాగా, ఒక్కో కేంద్రానికి రూ.5 కోట్ల వరకు నిధులు మంజూరు చేస్తుంది.

ఆసక్తి గల వ్యక్తులు, సంస్థలు తమ జిల్లా కలెక్టర్లకు జనవరి చివరి వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇప్పటికే కొన్ని జిల్లాల నుంచి దరఖాస్తులు అందగా, అనంతపురం జిల్లాలోని ఒక కేంద్రానికి ఆమోదం లభించింది. ఫిబ్రవరిలో కేంద్రానికి తుది ప్రతిపాదనలు పంపి, వచ్చే ఏడాదిలో ఈ కేంద్రాలను ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AndhraPradesh APNews DrivingLicense DrivingTrainingCenters RoadSafety TransportDepartment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.