📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Andhra Pradesh: టీచర్ పై కత్తితో దాడి చేసిన ఆటోడ్రైవర్

Author Icon By Saritha
Updated: February 12, 2026 • 1:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ లోని (Andhra Pradesh) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు(Nellore) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్కూలుకు వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై సదరు ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న నగల కోసం ఈ దారుణానికి తెగబడ్డాడు. రక్తమోడుతున్న ఉపాధ్యాయురాలిని రోడ్డుపై వదిలేసి వెళ్లాడు. గూడూరు రూరల్‌ మండలం కందలి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనదారులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

Read Also: Swachh Andhra: స్వచ్ఛాంధ్ర సాధనకు కలసికట్టుగా కృషిచేయాలి : పట్టాభి

Auto driver attacks teacher with knife

(Andhra Pradesh) గూడూరుకు చెందిన హరిత (35) ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. బాలాయపల్లి మండలం గొట్టిగాడి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. గూడూరు నుంచి నిత్యం స్కూలుకు వెళ్లి వస్తుంటారు. ఈ రోజు ఉదయం స్కూలుకు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలపై కన్నేసిన ఆటో డ్రైవర్.. నిర్మానుష్య ప్రాంతంలో ఆటోను ఆపి కత్తితో హరితపై దాడి చేశాడు.

ఆపై నగలను దోచుకుని కత్తిపోట్లతో రక్తమోడుతున్న హరితను రోడ్డుపై వదిలేసి వెళ్లాడు. ఆ మార్గంలో వెళుతున్న వాహనదారులు హరితను గమనించి ఆసుపత్రికి తరలించారు. వాహనదారుల సమాచారంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు.. ఆటోడ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మెరుగైన వైద్యం కోసం హరితను నెల్లూరుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Auto Attack Government Teacher Gudur Rural Knife Attack Latest News in Telugu Nellore Teacher Assault Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.