📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Andhra Pradesh: రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనమండలి

Author Icon By Saritha
Updated: March 4, 2026 • 3:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి బుధవారం రెండు అత్యంత కీలకమైన బిల్లులకు ఆమోదం వేసింది. రాష్ట్ర అభివృద్ధి, పునరుత్పాదక ఇంధన వనరుల పెంపు, స్థానిక పాలనలో సంస్కరణలే లక్ష్యంగా అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు, ఏపీ గ్రామ వార్డు బిల్లులను మండలి ఆమోదించింది.

Read Also: AP SSC Hall Tickets 2026: ఏపీలో రేపు టెన్త్ హాల్ టికెట్లు విడుదల

Andhra Pradesh: AP Legislative Council approves two key bills

అసైన్డ్ భూములకు ‘క్లీన్ ఎనర్జీ’ భరోసా

మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో వివరించిన ప్రకారం, ఈ సవరణ ద్వారా ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములను క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు (సౌర, పవన విద్యుత్ వంటివి) లీజుకు ఇచ్చే అవకాశం లభిస్తుంది. బంజరు లేదా చౌడు భూములుగా ఉండి సాగుకు పనికిరాని అసైన్డ్ భూములకు ఈ లీజు ద్వారా భరోసా లభిస్తుంది. ఎకరాకు ఏడాదికి రూ. 31 వేల లీజు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి రెండేళ్లకు లీజు మొత్తాన్ని 5 శాతం మేర పెంచుతూ చట్టంలో సవరణ చేశారు. అసైనీదారుల పూర్తి అనుమతితోనే భూములు తీసుకుంటారు. ట్రై-పార్టీ అగ్రిమెంట్ (త్రిపక్ష ఒప్పందం) ద్వారా లబ్ధిదారులకు పూర్తి రక్షణ కల్పిస్తారు. ఈ చట్టంతో రాష్ట్రంలో సుమారు రూ. 10 లక్షల కోట్ల విలువైన క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల 7.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.

‘స్వర్ణ గ్రామం’గా మారనున్న సచివాలయాలు

గ్రామ వార్డు స్థాయి పాలనలో మార్పులు తీసుకువస్తూ ఈ బిల్లును ఆమోదించారు. ప్రస్తుతం ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలను ఇకపై ‘స్వర్ణ గ్రామం’ మరియు ‘స్వర్ణ వార్డు’ సచివాలయాలుగా పిలుస్తారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP Legislative Council Assigned Lands Amendment Bill 2026 Latest News in Telugu Swarna Gramam Sachivalayam Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.