📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Andhra Pradesh: పుష్ప స్టైల్లో ‘తగ్గేదేలే’ అన్న అంబటి రాంబాబు

Author Icon By Saritha
Updated: February 12, 2026 • 3:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(Andhra Pradesh) మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబును పోలీసులు పీటీ వారెంట్‌పై రాజమండ్రి నుంచి గుంటూరు కోర్టుకు తరలించారు. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా టిక్కెట్ల అవినీతి కేసులో విచారణ కోసం కోర్టులో హాజరుపరిచారు. పోలీసు వ్యాన్ గుంటూరు కోర్టు ప్రాంగణానికి చేరుకున్న తర్వాత వాహనం దిగడానికి ముందు అంబటి రాంబాబు పుష్ప స్టైల్లో ‘తగ్గేదేలే’ అంటూ స్పందించారు.

Read Also: Pawan Kalyan: డిప్యూటీ సీఎంను కలిసిన బాలకృష్ణ, నాగబాబు

Ambati Rambabu says ‘nothing is too small’ in Pushpa style

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లా (Andhra Pradesh) అంబటి రాంబాబు (Ambati Rambabu) కూడా వ్యాన్‌లో సీటు మీద కూర్చుని గెడ్డం కింద చేయిని స్టైల్‌గా పెట్టి ‘తగ్గేదేలే’ అనే స్టైల్లో రియాక్షన్ ఇచ్చారు. ఆయనను కోర్టుకు తీసుకువస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అంబటి రాంబాబు గత నెల 31వ తేదీ నుంచి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఇప్పటికే రెండు కేసుల్లో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే, 2023లో లాటరీ ద్వారా అవినీతికి పాల్పడ్డారని సత్తెనపల్లి జనసేన నేతలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సత్తెనపల్లి పోలీసులు గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ambati rambabu Andhra Pradesh former minister Guntur court Latest News in Telugu PT Warrant Rajahmundry Telugu News YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.