📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Andhra Pradesh: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ ఆధారిత సేవలు ప్రారంభం

Author Icon By Saritha
Updated: March 9, 2026 • 11:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 18 స్టార్టప్ సంస్థలతో కలిసి వైద్య పరీక్షలు, ఇతర సేవల్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏఐ సేవలతో అతి తక్కువ సమయంలో వ్యాధి నిర్ధారణ, రోగులకు చికిత్స అందించే సమయం కూడా ఆదా అవుతుందంటున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా వీటి ఫలితాలను విశ్లేషించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదక ఇస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ (Minister Satyakumar) తెలిపారు.

Read Also: Pawan Kalyan Congratulates India: టీమ్ ఇండియాకు అభినందనలు:పవన్ కళ్యాణ్

Andhra Pradesh: AI-based services launched in government hospitals

తక్కువ సమయంలో మెరుగైన వైద్యసేవలు

వ్యాధుల్ని ప్రాథమిక పరీక్షలతో గుర్తించి.. తక్కువ సమయంలో మెరుగైన వైద్యసేవలు అందించొచ్చు. డాక్టర్లు, పేషెంట్ల మధ్య సంభాషణ రికార్డు చేస్తారు ఏఐ అప్లికేషన్ల సాయంతో పరీక్షలు చేసి ప్రాథమిక దశలోనే సమస్యల్ని గుర్తిస్తున్నారు. ఆయా ఆస్పత్రుల్లో క్యాన్సర్ గుర్తింపు, క్షయను గుర్తించడానికి, షుగర్, కిడ్నీ, థైరాయిడ్, రక్తపరీక్షలు కూడా ఏఐ ఆధారిత పరికరాలతో చేస్తున్నారు. గుండె సమస్యలు, ఐసీయూలో ఉన్నవారికి బీపీ, పల్స్, టెంపరేచర్, ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షణ లాంటి మరికొన్ని చోట్లో అందుబాటులో ఉన్నాయి. ఏఐ సాయంతో ఏపీ ప్రభుత్వం వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు మంత్రి సత్యకుమార్. సుమారు 40 అత్యాధునిక పరికరాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు.

ముఖ్యంగా విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు వంటి ప్రధాన ఆసుపత్రుల్లో ఈ ప్రయోగాత్మక పరీక్షలు జరుగుతున్నాయి. దగ్గు ద్వారా టీబీని గుర్తించడం, ఏఐ కెమెరాలతో సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ, గుండె జబ్బులు, చిన్నపిల్లల్లో నరాల సంబంధిత సమస్యలను పసిగట్టడం వంటి వినూత్న సేవలు ఇందులో ఉన్నాయి. రోగులు, వైద్యుల సంభాషణను రికార్డ్ చేయడం ద్వారా వైద్య చరిత్రను విశ్లేషించడం మరో విశేషం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AI in AP Healthcare AI Pilot Project AP government hospitals Minister satyakumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.