📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

News Telugu: Andhra Pradesh: కల్తీ దగ్గుమందు రాష్ట్రానికి రాలేదు..

Author Icon By Rajitha
Updated: October 7, 2025 • 11:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఔషధాల నాణ్యతపై నిరంతర నిఘా కల్తీ దగ్గుమందు రాష్ట్రానికి రాలేదు.. ఔషధాల నాణ్యతపై నిరంతర నిఘా ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ Satyakumar Yadav విజయవాడ : Andhra Pradesh మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో 12 మంది చిన్నారుల మరణాలకు దారితీసిన కల్తీ దగ్గు మందు సదరు కంపెనీ నుంచి రాష్ట్రానికి సరఫరా కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఔషధ దుకాణాలకు, ప్రభుత్వాసుత్రులకు సదరు కంపెనీ దగ్గు మందు పంపిణీ జరగలేదని వెల్లడించారు. తాజా పరిణామాలపై మంత్రి సత్యకుమార్ కుష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, Veerapandian రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలనా ఇంచార్జి డైరెక్టర్ జనరల్, రాష్ట్ర వైద్య సేవలు మోలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ గిరీషా MD Girisha నివేదికలు అందచేశారు.

GST 2.0: జీఎస్టీ-2.0పై కర్నూలులో భారీ బహిరంగ సభ

Adulterated cough medicine

కల్తీ దగ్గు మందు జాడ రాష్ట్రంలో లేనందున ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సూచనలు అనుసరించి, రెండేళ్లలోపు ఉన్న చిన్నారులకు దగ్గు, జలుబుకు సంబంధించి ద్రవరూపంలో వైద్యులు మందులు సూచించొద్దని ఆదేశాలు పంపాలని అధికారులకు తెలిపారు. ‘ఔషధ దుకాణాల వారికి సదరు కంపెనీ దగ్గు మందు సరఫరా జరిగినట్లు ఆనవాళ్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ల తనిఖీల్లో కనిపించలేదు. సదరు కంపెనీ నుంచి దగ్గు మందు పంపిణీ జరిగినట్లు దుకాణాల వారి వద్ద ఇన్వాయిస్లు కనిపించలేదు. దగ్గు మందు బాక్సులు దుకాణాల్లో కనిపించలేదు. డ్రగ్ ఇన్స్పెక్టర్ల ద్వారా తనిఖీల పరంపర ఇంకా జరుగుతూనే ఉంది.

కాంచీపురంకి

ఔషధ నియంత్రణ పరిపాలనా డైరెక్టర్ జనరల్ ప్రధాన కార్యాలయంలోని అధికార యంత్రాంగం నిత్యం పర్యవేక్షిస్తోంది” అని ఇంచార్జి డైరెక్టర్ జనరల్ గిరీషా ఆ నివేదికలో పేర్కొన్నారు. “ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసేందుకు కొనుగోలుచేసే మందుల్లో సదరు కంపెనీ కల్తీ మందు లేదు. రాష్ట్రంలో 4 రకాల కంపెనీల దగ్గుమందులు వాడుతున్నాం. కాంబినేషన్ ఫార్ములేషన్ కాకుండా సింగిల్ మాలిక్యుల్ సిరప్ మా సంస్థ ప్రభుత్వాసుపత్రులకు పంపిణీ చేస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాలలో కాంచీపురంకి చెందిన కంపెనీ శ్రీశాన్ ఫార్మస్యూటికల్స్ నుంచి కోల్డిఫ్ దగ్గు మందు కాంబినేషన్ రూపంలో సరఫరా జరిగింది. ఈ క్రమంలో డైఇథిలిన్ గ్లైకాల్ నిర్దిష్ట ప్రమాణాల కంటే అధిక మోతాదులో వాడిన కల్తీమందు ఆ రాష్ట్రాల్లో సరఫరా జరిగింది” అని రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ గిరిషా నివేదికలో వివరించారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో జరిగిన చిన్నారుల మరణాలకు కారణమైన కల్తీ దగ్గు మందు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉందా?
లేదు. రాష్ట్రానికి ఆ కంపెనీ నుంచి దగ్గు మందు సరఫరా కాలేదని ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.

ప్ర: రాష్ట్రంలో ఆ కల్తీ దగ్గు మందు జాడ దొరికిందా?
డ్రగ్ ఇన్స్పెక్టర్ల తనిఖీల్లో ఎక్కడా ఆ మందు జాడలు లేవు. ఇన్వాయిసులు లేదా బాక్సులు దుకాణాల్లో కనిపించలేదు.

Read hindi news: hindi.vaartha.com

epaper: https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh cough syrup fake medicine Health Department latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.