ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని స్కూళ్లు, కాలేజీల్లో నేటి నుంచి ఈ నెల 9 వరకు గ్రామ, వార్డు సచివాలయ విభాగం స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహించనుంది. అన్ని ప్రభుత్వ/ప్రైవేట్ పాఠశాలలు & జూనియర్ కాలేజీల్లో ఈ క్యాంపులు నిర్వహిస్తారని.. విద్యార్థుల Mandatory Biometric Update (MBU) పూర్తి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మొత్తం 16.51 లక్షల మంది విద్యార్థులకు MBU (Mandatory Biometric Update) చేయించుకోవాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 5.94 లక్షలు మంది మాత్రమే చేయించుకున్నారని చెబుతున్నారు. ఇంకా 10.57 లక్షల మంది బయో మెట్రిక్ అప్డేట్ పెండింగ్‌లో ఉందంటున్నారు.
Read also: Andhra Pradesh: ఆకాశాన్నంటిన చికెన్ ధరలు
ఉచితంగా అప్‌డేట్
5-15 ఏళ్ల విద్యార్థులకు బయోమెట్రిక్స్ ఉచితంగా అప్‌డేట్ చేస్తారు. కొత్త కార్డులు కూడా ఇక్కడే తీసుకోవచ్చు. గత సెప్టెంబర్ నుంచి ప్రతీ నెలా స్పెషల్ క్యాంపులను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 15–17 ఏళ్ల జూనియర్ కాలేజ్ విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. MBU (Mandatory Biometric Update) లేకపోతే NEET / JEE వంటి పరీక్షలకు అనుమతి లభించకపోవచ్చు అంటున్నారు.
విద్యార్థులు తమ సమీపంలోని స్కూల్ / జూనియర్ కాలేజీలో జరిగే ఆధార్ స్పెషల్ క్యాంప్‌కు హాజరుకావాలని సూచిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు విద్యార్థులను అవగాహన కల్పించి.. అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలి అన్నారు. ఈ క్యాంపుల సమయంలో నియమిత సిబ్బందిని ఇతర పనులకు నియమించరాదన్నారు. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌ను వెంటనే పూర్తి చేయాలి అన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: