📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Andhra Pradesh: పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం

Author Icon By Aanusha
Updated: January 11, 2026 • 10:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Andhra Pradesh: A rare honor for Pawan Kalyan

టాలీవుడ్ స్టార్ హీరో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అరుదైన, ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన ‘కెంజుట్సు’లో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. మూడు దశాబ్దాలకు పైగా మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆయన అంకితభావానికి నిదర్శనంగా, ‘సోగో బుడో కన్‌రి కై’ నుంచి ఫిఫ్త్ డాన్ పురస్కారం, ‘టకెడా షింగెన్ క్లాన్’లో తొలి తెలుగు వ్యక్తిగా ప్రవేశం పొందారు.

Read also: Tirumala: శ్రీవారిని దర్శించుకున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఈవో

మార్షల్ ఆర్ట్స్ ను ప్రదర్శించారు

ఆయన యుద్ధ కళల పరిజ్ఞానం సినిమాల్లోనూ ప్రతిబింబించింది. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’, ‘తమ్ముడు’, ‘ఖుషి’, ‘అన్నవరం’, ‘ఓజీ’ చిత్రాల్లో యుద్ధ కళలను ప్రదర్శించారు. జపనీస్ సినిమాలకే పరిమితమైన మార్షల్ ఆర్ట్స్ ను తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసిన మొట్టమొదటి హీరో ఆయనే. దీనివల్ల ఈ కళలకు అవగాహన, ఆదరణ పెరిగాయి.

ప్రత్యేకించి- తమ్ముడు సినిమాలో బాక్సింగ్ లో శిక్షణ పొందే సన్నివేశాల్లో ఆయన నిజంగానే మార్షల్ ఆర్ట్స్ ను ప్రదర్శించారు.పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్‌కు చేసిన అంకితభావానికి అనేక చారిత్రక గౌరవాలు దక్కాయి.జపాన్ వెలుపల సోకే మురమాట్సు సెన్సాయి ఆధ్వర్యంలోని ‘తకేడా షింగెన్ వంశం’లోకి ప్రవేశించిన తొలి భారతీయుడు కూేడా ఆయనే. ఈ గౌరవం జపానేతరులైన దక్కడం చాలా అరుదు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Japanese martial arts Kenjutsu latest news Pawan Kalyan Telugu News Tollywood star

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.