ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) లోని, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అల్లుడికి అత్తింటి వారు 158 రకాల వంటకాలతో సంక్రాంతి విందు ఇచ్చారు. తెనాలికి చెందిన వ్యాపారి వందనపు మురళీకృష్ణ, మాధవీలత దంపతులు తమ కుమార్తె మౌనికను రాజమహేంద్రవరానికి చెందిన శ్రీదత్తకు ఇచ్చి గతేడాది వివాహం చేశారు. పెళ్లయిన తర్వాత తొలి సంక్రాంతి కావడంతో అల్లుడికి మర్యాదలు చేయాలని భావించి విందు ఏర్పాటు చేశారు.
Read Also: Kanuma : రాష్ట్ర ప్రజలకు కనుమ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఈ సాంప్రదాయం ఎక్కడ ప్రారంభమైందంటే?
గోదావరి జిల్లాల వారికి ఏ మాత్రం తీసిపోకుండా.. పసందైన వంటలు, ఫలహారాలు, పండ్లతో వడ్డించి అల్లుడిని ఆశ్చర్య పరిచారు. గారెలు, బూరెలు, అరిసెలు, బొబ్బట్లు,లాంటి సంప్రదాయ పిండివంటకాలతో పాటు రకాల స్వీట్లు, పచ్చళ్లు ఆ వంటకాల్లో ఉన్నాయి. అత్తమామలు ఏర్పాటు చేసిన విందు, అతిథి మర్యాదలపై సంతోషం వ్యక్తం చేశాడు శ్రీదత్త.
ముఖ్యంగా వంటకాల విషయంలో అస్సలు వెనక్కి తగ్గరు. వందల రకాల పిండి వంటలు చేసి వడ్డిస్తారు. అవి చూడగానే కడుపు నిండిబోతుంది! సాధారణంగా ఇలాంటి పద్ధతి ఎక్కువగా గోదావరి జిల్లాల్లో ఉంటుంది. అయితే ఇప్పుడా సాంప్రదాయం గుంటూరు జిల్లాలోనూ ప్రారంభమైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: