हिन्दी | Epaper
విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill

Andhra Pradesh: రైతులకు శుభవార్త: పశువుల బీమా పథకం అమలు

Pooja
Andhra Pradesh: రైతులకు శుభవార్త: పశువుల బీమా పథకం అమలు

ఏపీ(Andhra Pradesh) రాష్ట్ర రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. పశుపోషణపై ఆధారపడి జీవనం సాగించే రైతులకు భరోసా కల్పించేందుకు పశువుల బీమా పథకంను ప్రారంభించింది. ఈ పథకం కింద పశువులు ప్రమాదవశాత్తూ లేదా అనారోగ్యంతో మరణిస్తే రైతులకు ఆర్థిక సాయం అందించనున్నారు.

Read Also: AP:మత్స్యకారులకు భారీ ఊరట – బీమా మొత్తం రూ.10 లక్షలకు పెంపు

Andhra Pradesh
Good news for farmers: Livestock insurance scheme implemented.

పాడి పశువుల సంరక్షణ రైతుల జీవనాధారంలో కీలక పాత్ర పోషిస్తుండటంతో, వారికి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు జనవరి 19 నుంచి స్వీకరిస్తున్నారు. రైతులు నేటి నుంచే దరఖాస్తు చేసుకుని బీమా పథకంలో చేరవచ్చు. ఈ బీమా(Andhra Pradesh) పథకంలో ప్రీమియం మొత్తాన్ని రైతులు పూర్తిగా చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం ప్రీమియంలో 85 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తే, మిగిలిన 15 శాతం మాత్రమే రైతులు చెల్లిస్తే సరిపోతుంది.

బీమా మొత్తం వివరాలు

  • ఆవులు, గేదెలకు: రూ.30,000
  • నాటు పశువులకు: రూ.15,000
  • మేలు జాతి ఎద్దులు, దున్నలకు: రూ.30,000
  • నాటు ఎద్దులు, దున్నలకు: రూ.15,000

రూ.30 వేల విలువైన పశువుకు మొత్తం ప్రీమియం రూ.1,920 కాగా, ఇందులో ప్రభుత్వ వాటా రూ.1,632. రైతు వాటా కేవలం రూ.288 మాత్రమే. రూ.15 వేల విలువైన పశువుకు ప్రీమియం రూ.960 కాగా, ఇందులో రైతు వాటా రూ.144 మాత్రమే చెల్లించాలి. ఈ పథకంలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఒక రైతుకు గరిష్టంగా 10 ఆవులు లేదా గేదెలకు, అలాగే 100 గొర్రెలు, 50 పందులకు మాత్రమే బీమా వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం

పశువుల బీమా పథకానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిబిరాల్లో రైతులు తమ పశువులకు వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు, బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడికక్కడే ప్రీమియం కూడా చెల్లించే సౌకర్యం ఉంది.

ఇక ఈ నెల 31వ తేదీ నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు కూడా నిర్వహించనున్నారు. ఈ శిబిరాల్లోనూ రైతులు బీమా పథకంలో నమోదు చేసుకోవచ్చు. పథకంలో చేరని రైతుల వివరాలను కూడా ఈ శిబిరాల్లో ప్రదర్శించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా పశువుల మరణం వల్ల రైతులకు కలిగే ఆర్థిక నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అభయ్ కొత్త అడుగుఅడవిబాట నుంచి అన్న ఒడికి

అభయ్ కొత్త అడుగుఅడవిబాట నుంచి అన్న ఒడికి

రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే పేదల ఇళ్ల కూల్చివేత

రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే పేదల ఇళ్ల కూల్చివేత

నేడు ‘డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి’

నేడు ‘డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి’

భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

మరణంతో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తత: రెండ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు!

మరణంతో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తత: రెండ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు!

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం

ముగ్గురు సభ్యుల కౌన్సిల్ చేతికి ఇరాన్ పాలన!

ముగ్గురు సభ్యుల కౌన్సిల్ చేతికి ఇరాన్ పాలన!

రేవంత్‌ రెడ్డికి భట్టి దంపతుల వెడ్డింగ్ ఇన్విటేషన్!

రేవంత్‌ రెడ్డికి భట్టి దంపతుల వెడ్డింగ్ ఇన్విటేషన్!

ఖమేనీ మృతిపై పుతిన్ ఆగ్రహం

ఖమేనీ మృతిపై పుతిన్ ఆగ్రహం

యుద్ధంలో ఏఐ అస్త్రం: ఇరాన్‌పై దాడుల్లో ‘క్లాడ్’ వినియోగం!

యుద్ధంలో ఏఐ అస్త్రం: ఇరాన్‌పై దాడుల్లో ‘క్లాడ్’ వినియోగం!

బహ్రెయిన్‌లో తెలుగువారి భద్రతపై అయ్యన్నపాత్రుడు ఆరా

బహ్రెయిన్‌లో తెలుగువారి భద్రతపై అయ్యన్నపాత్రుడు ఆరా

ఇది అత్యంత హేయమైన చర్య

ఇది అత్యంత హేయమైన చర్య

📢 For Advertisement Booking: 98481 12870