ఏపీ(Andhra Pradesh) రాష్ట్ర రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. పశుపోషణపై ఆధారపడి జీవనం సాగించే రైతులకు భరోసా కల్పించేందుకు పశువుల బీమా పథకంను ప్రారంభించింది. ఈ పథకం కింద పశువులు ప్రమాదవశాత్తూ లేదా అనారోగ్యంతో మరణిస్తే రైతులకు ఆర్థిక సాయం అందించనున్నారు.
Read Also: AP:మత్స్యకారులకు భారీ ఊరట – బీమా మొత్తం రూ.10 లక్షలకు పెంపు
పాడి పశువుల సంరక్షణ రైతుల జీవనాధారంలో కీలక పాత్ర పోషిస్తుండటంతో, వారికి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు జనవరి 19 నుంచి స్వీకరిస్తున్నారు. రైతులు నేటి నుంచే దరఖాస్తు చేసుకుని బీమా పథకంలో చేరవచ్చు. ఈ బీమా(Andhra Pradesh) పథకంలో ప్రీమియం మొత్తాన్ని రైతులు పూర్తిగా చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం ప్రీమియంలో 85 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తే, మిగిలిన 15 శాతం మాత్రమే రైతులు చెల్లిస్తే సరిపోతుంది.
బీమా మొత్తం వివరాలు
- ఆవులు, గేదెలకు: రూ.30,000
- నాటు పశువులకు: రూ.15,000
- మేలు జాతి ఎద్దులు, దున్నలకు: రూ.30,000
- నాటు ఎద్దులు, దున్నలకు: రూ.15,000
రూ.30 వేల విలువైన పశువుకు మొత్తం ప్రీమియం రూ.1,920 కాగా, ఇందులో ప్రభుత్వ వాటా రూ.1,632. రైతు వాటా కేవలం రూ.288 మాత్రమే. రూ.15 వేల విలువైన పశువుకు ప్రీమియం రూ.960 కాగా, ఇందులో రైతు వాటా రూ.144 మాత్రమే చెల్లించాలి. ఈ పథకంలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఒక రైతుకు గరిష్టంగా 10 ఆవులు లేదా గేదెలకు, అలాగే 100 గొర్రెలు, 50 పందులకు మాత్రమే బీమా వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం
పశువుల బీమా పథకానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిబిరాల్లో రైతులు తమ పశువులకు వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు, బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడికక్కడే ప్రీమియం కూడా చెల్లించే సౌకర్యం ఉంది.
ఇక ఈ నెల 31వ తేదీ నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు కూడా నిర్వహించనున్నారు. ఈ శిబిరాల్లోనూ రైతులు బీమా పథకంలో నమోదు చేసుకోవచ్చు. పథకంలో చేరని రైతుల వివరాలను కూడా ఈ శిబిరాల్లో ప్రదర్శించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా పశువుల మరణం వల్ల రైతులకు కలిగే ఆర్థిక నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: