📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Andhra Pradesh: గిరిజన గర్భిణుల కోసం 35 నూతన నిరీక్షణ వసతి భవనాలు

Author Icon By Saritha
Updated: March 18, 2026 • 12:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Andhra Pradesh: గిరిజన గర్భిణీల కోసం 7 సమీకృత గిరిజనాభివృద్ధి పరిధిలో 35 నిరీక్షణ వసతి గృహాల కోసం కొత్త భవనాలు నిర్మిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పాడేరు ఐటిడిఏ పరిధిలో 15, రంపచోడవరం, పార్వతీపురం, చింతూరు, శ్రీశైలం, కోట రామచంద్రాపురంలో 4 చొప్పున భవన నిర్మాణాల పనులు రూ.12.25కోట్లతో జరుగుతున్నాయని తెలిపారు. ఈ 35లో 22 కేంద్రాలు మే జూన్ నెలల్లో, మరో రెండు జులై, మిగిలిన వాటిని ఈ ఏడాది చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, చింతూరు, కోట రామచంద్రాపురం, శ్రీశైలం ఐటిడిఏల పరిధిలో కలిపి 76 నిరీక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇవి ప్రభుత్వాసుపత్రులకు అనుబంధంగానే పనిచేస్తున్నాయి. ఇందులో 41 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. మిగిలిన వాటికి ప్రస్తుతం నిర్మాణాలు జరుగుతున్నాయి.

Read Also: Anantapur crime: ఈతకు వెళ్లి నీటి కుంటలో పడి ఆర్మీ జవాన్ మృతి

Andhra Pradesh: 35 new shelters for tribal pregnant women

భవన నిర్మాణాల ప్రత్యేకతలు

ప్రతి భవనంలో 8 గదుల్ని నిర్మిస్తున్నారు. వీటిలో 4గదులు గర్భిణీలకు కేటాయిస్తారు. 4గదుల్లో ప్రతి దానికి ఒక మరుగుదొడ్డి నిర్మాణం కూడా జరుగుతోంది. అలాగే ఉమ్మడి వంటగది, రిక్రియేషన్ రూమ్, ఒక రిసెప్షన్ రూమ్, స్టోర్ రూమ్ ఉంటాయని, ఒక్కో భవన నిర్మాణానికి రూ.35 లక్షల చొప్పున వ్యయం చేస్తున్నారు. ఈ నిర్మాణాలు జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో ఐటిడిఏ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 27పిహెచ్సీలు, 6సిహెచ్సిలు, 2ఏరియా ఆస్పత్రులకు అనుసంధానంగా ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. పార్వతీపురం ఐటిడిఏ పరిధిలో మొండెంఖళ్ళు పిహెచ్సి, కోట రామచంద్రాపురం ఐటిడిఏ వరిధిలో బుట్టాయిగూడెం సిహెచ్సి, చింతూరు ఐటిడిఏ పరిధిలో రత్నాపురం ఏరియా ఆస్పత్రుల్లో ఈ నిర్మాణాలు కొనసాగుతున్నాయి..

13వేల మంది గర్భిణీలకు ప్రయోజనం

13వేల మంది గర్భిణీలకు ప్రయోజనం కొండలు, కోనల్లో నివసించే గర్భిణులను ఆశా వర్కర్, ఎఎన్ఎంలు ప్రసవ తేదికీ కనీసం వారం రోజులు ముందు ఇక్కడికి తీసుకొస్తారు. దీనివల్ల ప్రసవ సమయంలో రవాణాపరంగా, ఆరోగ్యవరంగా గర్భిణులకు సమస్యలు తప్పుతాయి. నిరీక్షణ వసతిగృహంలో గర్భిణీకి రోజుకి ఆహారం కోసం రూ.200లు సాయంగా ఉండే మరొకరికి రూ.200లు ఇస్తారు. సహాయకులుగా ఉండేవారు సదరు రోజుల్లో ఉపాధి కోల్పోయినందుకు నష్టపరిహారం కింద అదనంగా మరో రూ.200లు ఇస్తారు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో సుమారు 11వేల మంది గర్భిణులు ఈ కేంద్రాల ద్వారా ప్రయోజనం పొందారు. ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 9,500మంది వైద్యసేవలు పొందారు. ప్రస్తుత నిర్మాణాలు పూర్తయితే ఏడాదికి 13వేల మంది గర్భిణీలు ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh ITDA Paderu Satya Kumar Yadav Tribal health Andhra Pradesh Waiting halls for pregnant women

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.