ఆంధ్రప్రదేశ్(Andhra)పై మరోసారి తుఫాన్ ప్రభావం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే 48 గంటల్లో ఇది పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని తరువాత ఇది నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడి తుపానుగా మారవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Also: Donald Trump : భారత్-పాక్ విషయంలో ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో, గురువారం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. శుక్రవారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. శుక్రవారం నుండి ఆదివారం వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, సోమవారం – మంగళవారం కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా
ఇక రాష్ట్రంలో చలి తీవ్రత(Temparature) మరింత పెరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రివేళలు కర్కశంగా చల్లగా మారుతున్నాయి. మంగళవారం రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో కనిష్ఠంగా 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం ఈ సీజన్‌లో అత్యల్పంగా గుర్తించారు. అదే జిల్లాలోని ముంచంగిపుట్టులో 5.8, చింతపల్లిలో 6.8, డుంబ్రిగుడలో 7.8, పాడేరు, పెదబయలులో 8.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈశాన్య ఆంధ్ర జిల్లాలు అయిన పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, ఎన్టీఆర్ జిల్లాల్లో 15 డిగ్రీల లోపే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా చలి ప్రభావం పెరిగింది. సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం తెలంగాణలో చలిగాలులు వీచే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: