📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Ande Sri: అందెశ్రీ మృతి..చంద్రబాబు పవన్ కల్యాణ్ నివాళి

Author Icon By Saritha
Updated: November 10, 2025 • 12:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రసిద్ధ కవి మరియు వాగ్గేయకారుడు డాక్టర్ అందెశ్రీ మరణం తెలుగు సాహిత్య ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచింది. ఆయన అకస్మిక మరణం పట్ల (Ande Sri)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పాటు పలు రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ

తెలుగు సాహితీ రంగానికి అపార సేవలు చేసిన కవి, రచయిత అందెశ్రీ గారి మరణం తీవ్ర విషాదం. తెలంగాణకు రాష్ట్ర గీతం అందించిన ఆయన కీర్తి చిరస్మరణీయంగా నిలుస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.

Read also: జైలు నుంచి విడుదలైనా ఇంకా ఖైదీలుగానే.. కేంద్రం చేయూత

Ande Sri: అందెశ్రీ మృతి..చంద్రబాబు పవన్ కల్యాణ్ నివాళి

పవన్ కల్యాణ్, లోకేశ్ సంతాపం

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఒక ప్రకటన విడుదల చేస్తూ అందెశ్రీ మృతిపట్ల దుఖం వ్యక్తం చేశారు. గొర్రెల కాపరిగా భవన నిర్మాణ కూలీగా జీవితాన్ని ప్రారంభించి కవిగా ఎదిగిన అందెశ్రీ జీవితం అందరికీ ప్రేరణ. తెలంగాణ మాండలికం జానపద సంస్కృతిపై ఆయనకు ఉన్న పట్టు విశిష్టమైనది. ‘జయ జయహే తెలంగాణ’ గీతం ద్వారా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు, అని పవన్ పేర్కొన్నారు.

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కూడా ఎక్స్ (ట్విట్టర్)లో స్పందిస్తూ,

అందెశ్రీ గారి మరణం తెలుగు సాహిత్యానికి అపూర్వ లోటు. ఆయన రచనలు ప్రజల మనసుల్లో చిరకాలం నిలుస్తాయి. ఆయన కుటుంబానికి నా సానుభూతి అని తెలిపారు.

సాహిత్యానికి అపార సేవలు చేసిన కవి

అందెశ్రీ గారి సాహిత్య యాత్రలో గ్రామీణ జీవన శైలిని, జానపద సౌందర్యాన్ని ప్రతిబింబించే కవిత్వం ప్రధానంగా నిలిచింది. ఆయన రచనలు తెలంగాణ స్ఫూర్తిని, మానవ విలువలను ప్రతిధ్వనింపజేశాయి. తెలుగు ప్రజల గుండెల్లో ఆయన పదాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Andeshree Chandrababu Naidu Latest News in Telugu lyricist Nara Lokesh Pawan Kalyan Telangana Anthem Telangana Culture Telugu Literature Telugu News Telugu poet

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.