ఏకశిలా సాయిబాబా విగ్రహంగా పేరు ప్రఖ్యాతలు తాడిపత్రి టౌన్ : Anantapur అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణం సంజీవనగర్ 5వ రోడ్డులో వెలసిన శ్రీశివసాయి మందిరంలో శ్రీషిరిడి సాయిబాబా విగ్రహం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. రాజస్థాన్లోని జైపూర్ నుండి ప్రత్యేకంగా ఏకశిలతో 9.5 అడుగులు ఎత్తు, 7 టన్నులు బరువు కలిగి ఉండటం ఈ సాయిబాబా విగ్రహం ప్రత్యేకత. అహ్మదాబాడ్ కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు చెందిన అధికారి పవన్ సోలంకి తాడిపత్రికి చేరుకుని విగ్రహం ఎలా ఉంది ఏకశిలనా, విగ్రహం ప్రత్యేకత ఏంటో క్షుణ్ణంగా తెలుసుకుని వెళ్లారు. అనంతరం రికార్డులు పరిశీలించి భారతదేశంలోనే ఎక్కడ కూడా ఇలాంటి ఏకశిలా విగ్రహం ఇంత పరిమాణంలో లేదని ధ్రువీకరించారు.
Read Also: Liquor: లిక్కరు స్కామ్ లో నిందితులకు 24 వరకు రిమాండ్
Anantapur
Anantapur : అనంతరం గురువారం తాడిపత్రికి చేరుకుని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్, మెడల్స్ ను తాడిపత్రి ఎమ్మెల్యే జె.సి అశ్మిత్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జె.సి ప్రభాకర్రెడ్డి, ఎస్వి రవీంద్రా రెడ్డిలు అందుకున్నారు. తాడిపత్రికి ఆధ్యాత్మికలో ఆవార్డులు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాడిపత్రిని ది టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ చేసే ప్రయత్నంలోనే ఇలాంటి అవార్డులు రావడం ఎంతో శుభపరిణామమని మున్సిపల్ చైర్మన్ జె.సి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
తాడిపత్రి శ్రీశివసాయి మందిరానికి ఏ గుర్తింపు లభించింది?
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది.
విగ్రహం ప్రత్యేకత ఏమిటి?
ఇది 9.5 అడుగుల ఎత్తు, 7 టన్నుల బరువున్న ఏకశిలా సాయిబాబా విగ్రహం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: