Anantapur: రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా, జిల్లా ఎస్పీ పి. జగదీష్(P. Jagadish), ఐపీఎస్ ఆదేశాల ప్రకారం జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పోలీసులు మరియు ఆర్టీఏ అధికారులు కలిసి ప్రధాన రహదారులు, కుడా ప్రాంతాలలో రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
Read also: AP: ఆ ఉద్యోగులు సంక్రాంతి రోజుల్లో కూడా పని చేయాల్సిందే..!
వాహనదారులు నియమాలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ వినియోగం, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపకూడదు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఈ అవగాహన కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో, సురక్షిత డ్రైవింగ్ అలవాట్లను ప్రజల్లో పెంపొందించడంలో దోహదం కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: