Anantapur School Incident: అనంతపురం జిల్లా రాప్తాడులో శనివారం ఒక దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. పాఠశాల ప్రాంగణంలోకి చొరబడిన ఒక ఉన్మాది, రంపం మిషన్‌తో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘోర ఘటనతో తరగతి గదితో పాటు పాఠశాల ప్రాంగణమంతా తీవ్ర భయాందోళనలు, విద్యార్థుల హాహాకారాలతో అల్లకల్లోలంగా మారింది.
Read Also : YS Sharmila: యలహంక ఆస్తి నాదే.. నా పిల్లలదే: వైఎస్ షర్మిల
Anantapur School Incident: క్లాస్‌రూమ్‌లో రంపం మిషన్‌తో ఊచకోత.. రక్తపు మడుగులో విద్యార్థిని
రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం తరగతులు జరుగుతుండగా ఒక ఉన్మాది చెట్లు నరికే రంపం మిషన్‌తో హఠాత్తుగా పదో తరగతి గదిలోకి ప్రవేశించాడు. తీవ్ర ఆవేశంతో ఊగిపోతూ అక్కడ ఉన్న ఒక విద్యార్థిని ముఖం, శరీరంపై ఎక్కడికక్కడ తీవ్రంగా నరికాడు. ఈ దాడిలో ఆ విద్యార్థిని తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఉన్మాది సృష్టించిన బీభత్సానికి తరగతి గది మొత్తం రక్తసిక్తమైంది. అక్కడ ఉన్న మిగతా విద్యార్థుల పుస్తకాలు, బ్యాగులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ క్రమంలో మరో విద్యార్థినికి కూడా కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి.
ఆసుపత్రికి తరలింపు.. పాఠశాల వద్ద తల్లిదండ్రుల తీవ్ర ఆందోళన
రక్తపు మడుగులో పడి ఉన్న బాధితురాలిని గమనించిన ఉపాధ్యాయులు, స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే తమ పిల్లల క్షేమసమాచారాల కోసం తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో భద్రతా వైఫల్యంపై నిరసన వ్యక్తం చేస్తూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :