అనంతపురం : విశ్వ కవి, ప్రజాకవి యోగి వేమన తన పద్యాల ద్వారా సత్యం, సమానత్వం, మానవత్వం వంటి విలువలను సమాజానికి అందించారు. కుల, మత భేదాలకు అతీతంగా సామాజిక సామరస్యాన్ని నెలకొల్పడమే వేమన బోధనల ప్రధాన లక్ష్యమని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత తెలిపారు. శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం కటారుపల్లి గ్రామంలో సోమవారం కదిరి శాసనసభ్యుడు కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా, కన్నుల పండువగా విశ్వకవి, ప్రజాకవి యోగివేమన రాష్ట్రస్థాయి జయంతోత్సవాలు 2026 ఘనంగా నిర్వహించారు. సందర్భంగా గొల్లపల్లి నుంచి కటారుపల్లి యోగివేమన స్మారక కేంద్రం వరకు సాంప్రదాయ చెక్కభజన బృంద కళాకారులు, డప్పు వాయిద్యాలు, ‘యోగివేమన పద్యాల’ ప్లకార్డులతో వందలాది విద్యార్థిని విద్యార్థులతో భారీ ఈ
ర్యాలీ నిర్వహించారు.
Read also: AP: త్వరలో అందుబాటులోకి డ్రోన్ టాక్సీలు,అంబులెన్సులు: సీఎం
Minister Savitha participates in the birth anniversary
వేమన బోధనలు సామాజిక సామరస్యానికి మార్గదర్శకం:
ఈ వేడుకలలో రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మం సవితమ్మ, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ ఎంపీ బికె పార్థసారథి, శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, అమిలినా సురేంద్రబాబు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెలె పార్థసారథి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నాడ ముందుగా ముఖ్య అతిథులందరూ యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సవితమ్మ (savitha) మాట్లాడుతూ… వేమన ప్రజాకవి, సంఘసంస్కర్త ఆ కొనియాడారు. విశ్వదాభిరామ వినురవేమ అంటూ వేమన రాసిన పద్యాం తెలుగునాట ఎంతో ప్రాచుర్యం పొందాయన్నారు. వేమన కనుమూసిన కటా పల్లి గ్రామంలోనే ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవడా ఆనందకర విషయమన్నారు. వేమన సందేశాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషిచేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.
విద్యార్థులతో చెక్కభజనలు, డప్పులతో భారీ ర్యాలీ
జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ… ప్రజాకవి యోగివేమన బోధనలు సమాజానికి దిశానిర్దేశం చేస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యోగివేమన జయంతోత్సవాన్ని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం విశేషం అన్నారు. సమాజంలోని మూఢనమ్మకాలు, అహంకారం, అసమాన తలను ప్రశ్నిస్తూ సూటిగా, ఘాటుగా, నిజాన్ని నిర్భయంగా చెప్పిన యదార్థవాది. సాధనమున పనులు సమకూరు ధరణిలోన అని వేమన చెప్పారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి వేమన బోధనలను గుర్తుంచుకొని సమాజంలో ఉన్నతంగా ఎదగాలి అని ఆయన పిలుపునిచ్చారు.. ఎంపీ బికె పార్థసారథి మాట్లాడుతూ… సమాజంలో సామాజిక, ఆధ్యాత్మిక, మూఢాచా రాలు, కుల మతాలకు అతీతంగా పామరులకు సైతం అర్థమయ్యేలా చైతన్యం కలిగిస్తూ తన పద్యాలతో విశ్వకవిగా మహనీయుడు యోగివేమన అన్నారు. సత్యసాయి జిల్లాలో ఉన్న ప్రాంతాలన్ని ఒక టూరిజం సర్క్యూట్ గా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కూడా గొప్ప సంకల్పంతో ఉన్నారు..
సమాజానికి దిశానిర్దేశం చేసే వేమన పద్యాలు
ఆ దిశగా కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ… శతాబ్దాల క్రిందటే సామాజిక రుగ్మతలను అర్థం చేసుకొని.. తన చిన్న పద్యాలతో ప్రజా చైతన్యం తీసుకువచ్చిన మహనీయుడు యోగివేమన అన్నారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ… నేటి ఆర్టిఫిషియల్ యుగంలో కూడా 17వ శతాబ్దిలో పాడిన ఒక మహనీయుని స్మరించుకుంటున్నామంటే యోగివేమన ఎంత గొప్ప ప్రజాకవో మనమందరము గుర్తుంచుకోవాలన్నారు. ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి తన సాయి శక్తుల కృషి చేస్తామన్నారు.
ఈ ప్రాంతం, నియోజకవర్గానికి మంచి చేయడానికి అలాగే కటారుపల్లె, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తిమ్మమ్మ మర్రిమాను, శ్రీ లక్ష్మినరసింహ స్వామీదేవాలయం, పాలపాటిదిన్నె అంజనేయస్వామి ఆలయంను, ప్రశాంతి నిలయం, లేపాక్షిని అనుసంధానం చేసి అన్నింటినీ కలుపుతూ ఇక్కడ ఒక టూరిజం హబ్డిర్పాటుకు రూ.6.30 కోట్లతో ప్రభుత్వా నికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుందన్నారు. యోగి వేమనకు ప్రాచుర్యం కల్పిస్తూ.. ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడం గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో కటారపల్లిని యోగివేమన మండలంగా ప్రకటించేలా కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు, కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.
ఏషియన్ బుక్ అఫ్ రికార్డు
సోమవారం కటారిపల్లిలో నిర్వహించిన విశ్వ కవి ప్రజా కవి యోగివేమన జయంతోత్సవాలు 2026 పురస్కరించుకొని.. నిర్వహించిన కార్యక్రమంలో ఓకే వేదిక నుంచి ఒకేసారి వేలాది మంది ఒకే ప్రాంతంలో ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో యోగివేమన పద్యాలు ఆలపించి రికార్డు సృష్టించారు. దీన్ని గుర్తిస్తూ ఏషియన్ బుక్ అఫ్ రికార్డులో యోగివేమనకు స్థానం కల్పిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించి ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మరియు శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్కు అందజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: