Anantapur: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు మండలాల్లో చిరుతపులుల సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా మడకశిర, కళ్యాణదుర్గం, శింగనమల ప్రాంతాల్లో చిరుతలు తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Read Also: Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ
శింగనమల మండలంలో ఇద్దరిపై దాడి
ఇటీవల శింగనమల మండలంలో ఇద్దరిపై దాడి జరిగిన ఘటనపై అటవీశాఖ అధికారులు స్పందిస్తూ.. అది చిరుత దాడి(Leopard Attacks) కాదని, అడవి పిల్లి వల్ల జరిగినట్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ, తమ గ్రామాల్లో చిరుతలు కనిపిస్తున్నాయని స్థానికులు గట్టిగా చెబుతున్నారు. వరుసగా వస్తున్న ఈ వార్తలతో పల్లె జనం పొలాలకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: