📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Anam Ramanarayana Reddy: మెట్టప్రాంత అభివృద్ధికి కృషిచేస్తాం :మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

Author Icon By Sharanya
Updated: July 18, 2025 • 12:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వరికుంటపాడు (నెల్లూరు): తన రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటినుంచి ఎక్కువ కాలం మెట్టప్రాంత ప్రజలతోనే ముడిపడివున్నదని అందువల్లనే తాను మెట్టప్రాంత అభివృద్ధికి శాయశక్తులా కృషిచేస్తానని రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) అన్నారు. గురువారం వరికుంటపాడు మేజర్ పంచాయతీలో అండ్రవారిపల్లి, వరికుంటపాడు ఎస్సి కాలనీలలో ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్యఅతిధిగ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నాడు.

మండలపార్టి కన్వీనర్చండ్ర మధుసూదన్రావు ఆధ్వర్యంలో నేతలు కార్యకర్తలు మంత్రి రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే కాకర్లకు ఘన స్వాగతం పలికారు. మాజి ఎఎమ్సి చైర్మన్ అండ్ర నాగిరెడ్డి, టిడిపినేత అండ్ర శివరామిరెడ్డి ఆధ్వర్యంలో సాప్రదాయ పద్దతిలో స్వాగతం పలికారు. అనంతరం అండ్ర నాగిరెడ్డి నివాసంలో జరిగిన పాత్రికేయ సమావేశంలో మంత్రి ఆనం (Anam Ramanarayana Reddy) మాట్లాడుతు తన కుటుంబానికి ఆప్తుడైన నాగిరెడ్డిని పరామర్శించానని అనంతరం ప్రభుత్వం ఏర్పడిని సంవత్సర కాలంలోనే రాష్ట్రంలో 5,400 పైగ దేవాలయాలకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు దూప, దీప, నైవేద్యాలు కైంకర్యాల కోసం నిధులు మంజూరు చేశామని, నెల్లూరు జిల్లాలో 107 దేవాలయాలకు నిధులు (Funding for temples) అందజేశామన్నారు. ఆలయాల పునర్ నిర్మాణ కార్యక్రమంలో భాగంగ జిల్లాలో షుమారు 48.85కోట్ల రూపాయల నిదులిచ్చామని, ఉదయగిరి నియోజకవర్గంలో ఎంఎల్ఎ కాకర్ల సురేష్ సూసించిన మేరకు రెండు దేవాలయాలకు 3కోట్ల రూపాయలు అందజేశామని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి న అనంతరం సూపర్ సిక్స్ పదకాలైన తల్లికి వందనం, ఎన్టీఆర్ బరోస పెన్షన్ల (NTRs pensions)పెంపుతోపాటు డ్వాక్రా మహిళలకు గతంలో చంద్రబాబునాయుడు సిఎంగ ఉన్న సమయంలో గ్యాస్ స్టౌవ్లు ఇచ్చామ ని, ప్రస్తుతం ఉచితంగ మూడు సిలిండర్లు అందజేశామని ఇందులో 42,383 మంది లబ్దిదారులు లబ్దిపొందారన్నారు. వాలంటీర్ వ్యవస్థ లేకుండానే సచివాలయ సిబ్బంది ప్రభుత్వ యంత్రాంగంతో ఇళ్ళ వద్దనే పెన్షన్లు పంపిణి చేస్తున్నామని తెలిపారు.

గత జగన్ ప్రభుత్వం 10.5లక్షల కోట్ల రూపాయలు అప్పులు కూటమి ప్రభుత్వ నెత్తిన పెట్టిందని ఆరోపించారు. నేటి కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమంకోకసం అన్నదాత సుఖీభవ కార్యక్రంతో మూడు విడతల్లో 20వేల రూపాయలు రైతుల అకౌంట్లో వేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం పట్టించుకోని నిరుద్యోగుల జీవితాలలో వెలుగులు నింపేల నేడు మెగా డిఎస్సితో 16,343టీచర్ పోస్ట్లను అతి త్వరలోనే పూర్తిచేసి పాఠశాలకు పంపడం జరుగుతుందన్నారు. జగన్ తన హయాంలో రైతుల ఆస్తులు దోచుకునేందుకునేం దుకు పన్నాగంపూని ల్యాంట్ టైటిల్ యాక్ట్ వంటి నల్ల చట్టాన్ని తీసుకొచ్చి పాస్పుస్తకాలపై తన ఫొటోను ముద్రించి రాజముద్రను లేకుండాచేయడంతో రైతులు అల్లకల్లోలం అయిపోయారని ఆనల్లచట్టాన్ని కూటమి ప్రభుత్వం రద్దుచేసిందన్నారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Shankar Rao: ఒబిసిల రిజర్వేషన్లకై సిఫార్సు చేయండి: శంకరరావు

Anam Ramanarayana Reddy Andhra Pradesh Infrastructure AP Minister Statements Breaking News Drinking Water Projects latest news Telugu News Upland Area Development

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.