Anakapalli: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఉత్తరాంధ్రలో మరో భారీ ఔషధ తయారీ పరిశ్రమకు అంకురార్పణ జరిగింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలోని సీతపాలెం వద్ద ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్) లో ప్రముఖ ఫార్మా కంపెనీ బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ముందుగా రాంబిల్లి మండలంలోని సీతపాలెం ఇండస్ట్రియల్ పార్క్ కు చేరుకున్న మంత్రి లోకేష్ కు కంపెనీ ప్రతినిధులు, కూటమి నేతలు మంగళవాయిద్యాల తో ఘనస్వాగతం పలికారు.
Read Also: Nimmala Ramanaidu: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు: సుజల స్రవంతికి రూ.600 కోట్లు కేటాయింపు
అనంతరం బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమకు మంత్రి లోకేష్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. రాంబిల్లి మండలం ఇండస్ట్రియల్ పార్క్ లో బ్లూ జెట్ పరిశ్రమ ఫార్మాస్యూటికల్ ఇంటర్మీడియట్లు, కాంట్రాక్ట్ డెవలప్ మెంట్ తయారీ యూనిట్ ను ఏర్పాటుచేయనుంది. ఇందుకు రూ.2,300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 1,750 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రత్యేక ఔషధ, ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన బ్లూజెట్ పరిశ్రమకు కూటమి ప్రభుత్వం 102.48 ఎకరాలను కేటాయించింది. మూడు దశల్లో ఫార్మా కంపెనీని నిర్మించనున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్, బీయలమంచిలి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఏపీఆర్డీసీ ఛైర్మన్ పి.నాగేశ్వరరావు, బ్లూ జెట్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ అక్షయ్ బన్సారీలాల్ అరోరా, మేనేజింగ్ డైరెక్టర్ శివెన్ అరోరా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వేణుబాబు, సహ వ్యవస్థాపకులు & ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరేష్ షా, కలెక్టర్ విజయ కృష్ణన్, బ్లూ జెట్ హెల్త్‌కేర్ బృంద సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ఏపీఐఐసీ, వివిధ శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: