అనకాపల్లి(Anakapalli crime) జిల్లా కోటవురట్ల మండలంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ బాలిక తన ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె వదిలిన సూసైడ్ నోట్‌లో ఈ అఘాయిత్యానికి దారితీసిన కారణాలను వివరించినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: iBOMMA: కేసులో సంచలనం.. నకిలీ పాన్, లైసెన్స్ వెలుగులోకి
ఆ లేఖలో తాను ఒక యువకుడిని ప్రేమిస్తున్నానని, అతడు లేకుండా జీవితం ఊహించుకోలేనని పేర్కొంది. అయితే తాను మరో యువకుడిని ప్రేమిస్తున్నాననే అపోహతో మొదట ప్రేమించిన వ్యక్తి తనతో మాట్లాడటం మానేశాడని, ఈ పరిస్థితిని తట్టుకోలేక తీవ్ర మానసిక ఆవేదనకు లోనైనట్లు రాసింది. తల్లిదండ్రులకు అపకీర్తి కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సూసైడ్(Suicide) నోట్‌లో పేర్కొంది.
మానసిక ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం
ఇదిలా ఉండగా, పుస్తకాలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన సమయంలో తమ కుమార్తె ఒక యువకుడితో వాగ్వాదానికి దిగిన దృశ్యాన్ని తాము చూశామని, ఆ ఘటన తరువాత ఆమె తీవ్ర మనస్తాపానికి లోనై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం(Postmortem) కోసం ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు పూర్తైన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై రమేష్ వెల్లడించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సహచర విద్యార్థినులు బాలిక భౌతిక కాయాన్ని సందర్శించి కన్నీటితో వీడ్కోలు పలికారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: