తిరుమలలో భక్తుల భద్రత మరింతగా పెంచే దిశగా గురువారం కీలక భద్రతా సమీక్ష జరిగింది. ఈ సమావేశం అన్నమయ్య భవన్‌లో జరిగింది. పోలీసు, TTD, ఇతర భద్రతా విభాగాల అధికారులు ఇందులో పాల్గొన్నారు.ఈ సమావేశానికి అనంతపురం రేంజ్ డీఐజీ షెమూషీ భాజ్‌పేయీ అధ్యక్షత వహించారు. ఇటీవల పహల్గాం ఘటన నేపథ్యంలో భద్రతా ఆడిట్‌ను మరింత బలంగా అమలు చేయాలన్న ఉద్దేశ్యంతో ఇది జరిగింది.డీఐజీ మాట్లాడుతూ, “తిరుమలలో భక్తుల మానసిక శాంతి కాపాడడం అత్యవసరం” అన్నారు. భద్రతా విభాగాలు పరస్పరం కలసి పనిచేయాలన్నారు.
బద్లింపులు ఎలా ఉండాలి? – ప్రెజెంటేషన్‌లో వివరాలు
టీటీడీ ఇన్‌ఛార్జి సీవీఎస్ఓ, తిరుపతి అర్బన్ ఎస్‌పీ హర్షవర్ధన్ రాజు, గత భద్రతా సమీక్షలలో ఇచ్చిన సూచనలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2023 మే నెలలో చేసిన సిఫార్సులు, తాజా పరిస్థితుల నేపథ్యంలో చేపట్టాల్సిన మార్పులు వివరించారు.
భద్రతా బలగాలకు స్పష్టమైన మార్గదర్శకాలు
డీఐజీ మాట్లాడుతూ, ప్రతి భద్రతా బృందానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు (SOPs) అవసరం అన్నారు. ఏపీఎస్పీ, డీఏఆర్, ఎస్పీఎఫ్, సివిల్ పోలీస్, టీటీడీ సిబ్బంది… అన్నీ ఒకేలా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.తలకోన, మామండూరు, తుంబురు తీర్థం వంటి ప్రాంతాల్లో భద్రతా చర్యలు మరింత పటిష్టం కావాలన్నారు. శేషాచల అటవీ ప్రాంతానికి చెందిన 14 రహస్య మార్గాలు ముఖ్యమన్నారు.ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి కూడా స్పెషల్ శిక్షణ ఇవ్వాలని సూచించారు. యాక్సెస్ కంట్రోల్ బృందాలు పూర్తి సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఎవరెవరు పాల్గొన్నారు?
ఈ సమీక్షలో గ్రేహౌండ్స్ కమాండర్ ఎస్పీ డా. గరుడ్ సునీల్,
ఐఎస్‌డబ్ల్యూ ఎస్పీ అరిఫ్ హఫీజ్,
తిరుపతి డీఎఫ్ఓ వివేక్ ఆనంద్,
విజిలెన్స్, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also : Nara Lokesh : మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ