ఆరునూరైనా, నూరు ఆరైనా ఎలాగైనా గ్రీన్ ల్యాండ్ను హస్తగతం చేసుకునేందుకు అమెరికా మహాసంకల్పం చెప్పుకుంది. గ్రీన్లాండ్ విష యంలో ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయి నా తమ తడాఖా చూపించాలన్న ఉత్సాహంతో అమెరికా (America)అడుగులు వేస్తోంది. అమెరికా దేశ భద్రత కోసమే తాను గ్రీన్లాండ్ ను సొంతం చేసుకోవాలని అనుకున్నట్లు పదే పదే శ్వేతసౌధాధినేత ట్రంప్ చెప్తూనే ఉన్నారు. అది తమ ఆధీనంలో లేకపోతే ‘గోల్డెన్ డోమ్’ సమస్యలో పడుతుం దని ఆయన అభిప్రాయం. గ్రీన్లాండ్ విషయంలో తమకు వంతపాడకుంటే నాటో మిత్ర దేశాలపై 10శాతం సుంకం విధించడానికి కూడా ట్రంప్ వెనుకాడటం లేదు. డెన్మార్క్, నార్వే, స్వీడన్ ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్, ఫిన్లాండ్ వంటి యూరోపియన్ దేశాలపై 10శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటిం చారు. అయితే ఈ సుంకాలన్నీ ఫిబ్రవరి 1 నుంచి పెరు గుతాయని కాస్త సమయమిచ్చారు. అంతే ఆయా దేశాల వారు పునరాలోచించుకుంటారని ఆశకాబోలు. గ్రీన్లాండ్ ఆయా దేశాలు దిగిరాకపోతే జూన్ 1 నుంచి ఈ సుంకాల ను 25 శాతానికి పెంచుతానని హెచ్చరిక జారీ చేశారు. సాధారణంగా ఆయన తన ఆలోచనలు, ఉద్దేశాలు, ప్రణా ళికలను తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’ సోషల్లో ప్రకటించడం ఆయన అలవాటు. అకారణంగా తమపై టారిఫ్ లను ప్రకటించడాన్ని యూరప్ దేశాలు ఖండిస్తున్నాయి. గ్రీన్ల్యాండ్ పూర్తిగా డెన్మార్క్సా మ్రాజ్యంలోనిదేనని, ఈ విషయంలో తమ వైఖరిలో మార్పు లేదని వారంతా స్పష్టం చేస్తున్నారు. వాటి భవిష్యత్ను డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రజలు మాత్రమే నిర్ణయించుకో వాలి. తప్ప అమెరికా (America)కాదని వారు ముక్తకంఠంతో నిర్ణ యించారు. గ్రీన్ ల్యాండ్ దురాక్రమణ ప్రయత్నాలపై డెన్మార్క్ పాలకులతోపాటు,గ్రీన్ల్యాండ్ ప్రజలు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నాటో మిత్ర దేశాల సమష్టి భద్రత కోసం కృషి చేస్తున్న మిత్రపక్షాలపైనే టారిఫ్ లు విధించడం సరికాదని యూరప్ దేశాల నేతలు ట్రంప్కు హితవు చెబుతున్నారు. పైగా ఆర్కిటిక్ ప్రాంత రక్షణ మొత్తం ‘నాటో కూటమికి అతికీలకమైన అంశం. అలాంటిది అంతర్గతంగా దూరాలు పెరిగిపోయే చర్యలనుతాము అంగీకరించేది లేదని ధ్వజమెత్తారు కూడా. యూరప్ మిత్ర దేశాలను బ్లాక్మెయిల్ చేయడం ట్రంప్కు సరైన పద్ధతి కాదని స్వీడన్ ప్రధాని క్రిస్టెర్సన్ అంటే ట్రంప్ బెదిరిం పులకు తాము లొంగేదిలేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ నిష్కర్షగా చెప్పారు.నార్వే, స్వీడన్, యుకెలతో కూడా వీరు చర్చిస్తున్నారు. అందరూ ఏకాభిప్రాయానికి వస్తే ‘నాటో కూటమి నుంచి అమెరికాకు ఉద్వాసన తప్పదు. లేదా తెగతెంపులు చేసుకునేందుకు అమెరికాయైనా ముందుకొస్తుంది. నాటో కూటమి బద్దలవకుండా ఉంటేనే తమకు బలమని వారి నిర్ణయం. కాగా ఆమెరికా కలసి రాకుంటే విచ్చిన్నమే. అంతమాత్రాన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనపట్టు వదలడం లేదు. మిత్రదేశాలమధ్య విబేధాలతో రష్యా, చైనాలకే ప్రయోజనం కలుగుతుందని ఈయూ విదేశాంగ విధాన చీఫ్ కాజా కల్లాస్ హెచ్చరిస్తున్నారు. గ్రీన్ల్యాండ్ తన ఆధీనంలో లేకుంటే రష్యా, చైనాలు ప్రయోజనం పొందుతాయని ట్రంప్ యోచిస్తున్నారు. తమ మధ్యసఖ్యత గురించి అందరూ కలిసి ఆలోచించుకోవాల్సి న సమయం ఆసన్నమైంది. అమెరికా మొండిగా వ్యవహరిస్తే నాటో కూటమిలోని యూరోపియన్ దేశాలతో సం బంధ బాంధవ్యాలు చెడతాయి. ఇప్పటికే డెన్మార్క్ నియం త్రణలో ఉన్న గ్రీన్ల్యాండ్ భద్రత నాటో ఉమ్మడిబాధ్యత అని పేర్కొంటూ జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్, నార్వే, ఫిన్ లాండ్, నెదర్లాండ్స్, బ్రిటన్ సైనిక బలగాలు గ్రీన్ ల్యాండ్ కు రక్షణగా నిలబడ్డాయి. ఇదే సమయంలో అమెరికా దుందుడుకు చర్యలకు దిగితే ఒకే కూటమిలోని దేశాల మధ్య పొరపొచ్చాలు తప్పవు. చర్చల ద్వారా మిత్రుల మధ్య విబేధాలు సమసిపోయేలా కృషి చేసుకోవాల్సిన తరుణంలో హెచ్చరికలు చేసుకునే పరిస్థితి ఉండరాదు. కానీ పరిస్థితులు మరింత విషమిస్తున్న సంకేతాలు కన పడుతున్నాయి. ఇప్పటికే గ్రీన్ల్యాండ్ టారిఫ్లను ఎగతాళి చేస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేక రాయబారి కిరిల్ డిమిత్రివ్ ట్రంప్, యూరప్ దేశాలమధ్య బెడిసికొడుతున్న సంబంధాలను ఎద్దేవా చేస్తూ పోస్టు పెట్టారు. ఈ ఎని మిది దేశాలను ఏమాత్రం లెక్క చేయకుండా ట్రంప్ వారి మధ్య సయోధ్యకన్నా ఏకపక్షంగా యుద్ధ ప్రక్రియకుసాహ సించడం ప్రపంచంలోని ఏ దేశమూ హర్షించడం లేదు. మరో అడుగు ముందుకేస్తూ యూరోపియన్పార్లమెంటు అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేస్తూ తీర్మానించింది. గత యేడాది జులైలోనే ఈవాణిజ్య ఒప్పందం కుదిరింది. అమెరికాకు ఎగుమతి చేసే యూరో పియన్ వస్తువులపై 15శాతం సుంకాలు వసూలుచేస్తుంది. అదే సమయంలో ఈయూ దేశాలకు అమెరికా నుండి దిగుమతిఅయ్యే ఉత్పత్తులపై ఎలాంటి సుంకాలూ విధిం చవు. త్వరలో యూరోపియన్ పార్లమెంటు ఆమోదించా ల్సిన తరుణంలో ఈవాణిజ్య ఒప్పందాన్ని నిలిపి వేసిం దంటే అప్రకటిత యుద్ధం మొదలైనట్లే. అమెరికాతో డీలు ఆపేసిన ఐరోపా సమాఖ్య వెనువెంటనే దక్షిణ అమెరికాలోని మెర్కొనర్ కూటమి దేశాలతోవాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా నుంచి అధిక టారిఫ్ల బెడదను ఎదుర్కొంటున్న సందర్భంలో చైనా నుంచి చౌక ఉత్పత్తుల వరదకుర్యవసానాన్ని కూడా బేరీజు చేసుకొని ముందుకు సాగుతోంది. ఇదే కొనసాగితే అమెరికా ఒక అడుగు వెనక్కి వేయడం తప్పదేమో!
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: