Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు తన ఇంటిపై జరిగిన దాడిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా వచ్చిన వ్యక్తులు తన నివాసాన్ని ముట్టడించారని, ఆ సమయంలో ఇంట్లో చిన్న పిల్లలు, మనవళ్లు ఉన్నారనే కనీస మానవత్వం కూడా లేకుండా ప్రవర్తించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులకు పోలీసుల సహకారం కూడా ఉందని, రక్షణ కల్పించాల్సిన వారే తనను అక్కడి నుండి పారిపోమని చెప్పడం దారుణమని ఆయన పేర్కొన్నారు.
Read Also: Bombay High Court Judgment: బిడ్డ గుర్తింపునకు తల్లి పేరే చాలు
రాజకీయ కక్షసాధింపుపై విమర్శలు
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandrasekhar) చేసిన వ్యాఖ్యలను అంబటి రాంబాబు గుర్తు చేశారు. “24 గంటల్లో అంబటికి సినిమా చూపిస్తాం” అని పెమ్మసాని అన్నారని, ఆ వ్యాఖ్యలకు అనుగుణంగానే ఈ దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. కేవలం రాజకీయ విమర్శలు చేసినంత మాత్రాన భౌతిక దాడులకు దిగుతారా అని ప్రశ్నించారు. ఒకవేళ తన మాటలు అభ్యంతరకరంగా ఉంటే చట్టపరంగా కేసులు పెట్టాలి కానీ, ఇలా రౌడీయిజం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. తనను 18 రోజుల పాటు జైల్లో నిర్బంధించినా భయపడేది లేదని అంబటి స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: