📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Amaravati: విజయవాడ పరిధిలో కృష్ణానదిపై రెండు ఆరు వరుసల వంతెనలు!

Author Icon By Rajitha
Updated: October 22, 2025 • 11:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Amaravati: ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పనులు వేగవంతం విజయవాడ : ఎపి రాజధాని అమరావతి, విజయవాడ పరిధిలో కృష్ణానదిపై రెండు ఆరు వరుసల వంతెనలు నిర్మించనున్నారు. మొదటి వంతెన మున్నలూరు వద్ద 3.15 కిలోమీటర్ల మేర, రెండవ వంతెన మున్నంగి వద్ద 4.8 కిలో మీటర్ల మేర ఉంటుంది. ఈ వంతెనల నిర్మాణం పూర్తయితే గుంటూరు, విజయవాడ, (vijayawada) తెనాలి ప్రాంతాల మధ్య రవాణా మరింత సులభతరం కానుంది. రాష్ట్ర రాజధాని అమరావతి చుట్టూ 190 కిలోమీటర్ల పొడవుతో ఔటర్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) నిర్మించేందుకు నిర్మించేం ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది.. ఈ ప్రాజెక్ట్ కోసం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఎఐ) సవివర ప్రాజెక్ట్ నివేదిక (డిపిఆర్)ను సిద్ధం చేసి, ఆమోదం కోసం ఢిల్లీ ప్రధాన కార్యాలయానికి పంపింది. ప్రాజెక్ట్ మొత్తం వ్యయాన్ని రూ.24,791 కోట్లుగా అంచనా వేశారు.

Read also: Heavy Rains: భారీ వర్షాల ప్రభావం – నెల్లూరులో స్కూళ్లకు సెలవు

Amaravati: విజయవాడ పరిధిలో కృష్ణానదిపై రెండు ఆరు వరుసల వంతెనలు!

హైదరాబాద్ (Hyderabad) ఓఆర్ఆర్ పొడవు 158 కిలోమీటర్లు కాగా, అమరావతి ఒఆర్ఆర్ 190 కిలోమీటర్లతో దానికంటే పెద్దది కానుంది. ఇది రాజధాని ప్రాంత అభివృద్ధిలో కీలకంగా మారనుంది. NHAI రూపొందించిన ప్రణాళిక ప్రకారం, అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణాన్ని 12 ప్యాకేజీలుగా విభజించి చేపట్టనున్నారు. ప్రతి ప్యాకేజీని వేర్వేరు దశల్లో టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. ఈ రింగ్ రోడ్ మొత్తం ఆరు వరుసల ప్రధాన మార్గంతో, రెండు వైపులా సర్వీస్ రోడ్లు కలిపి నిర్మించనున్నారు. ప్రతి వైపు రెండు వరుసల సర్వీస్ రోడ్లు ఉండటం మొత్తం పది వరుసల రహదారి నిర్మాణం అవుతుంది. ఓఆర్ఆర్ కోసం 140 మీటర్ల వెడల్పుతో భూ సేకరణ చేపట్టనున్నారు.

మొత్తం 190 కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ జరుగుతోంది. ఈ భూసేకరణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు భరిస్తుందని హామీ ఇచ్చింది. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.24,791 కోట్లు కాగా, అందులో రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ.3,117 కోట్ల భారం పడనుంది. భూసేకరణ, సదుపాయాల ఏర్పాటు వంటి అంశాల్లో రాష్ట్రం సహకరి స్తుంది. ప్రాజెక్ట్ ఆమోదం పొందిన వెంటనే దశలవారీగా 12 ప్యాకేజీలుగా నిర్మాణం కొనసాగనుంది. డీపీఆర్ లోని అన్ని ప్రతిపాదన లను NHAI ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. అమరావతి (Amaravati) ఒఆర్ఆర్ ప్రాజెక్ట్ ద్వారా భవిష్యత్తులో రాజధాని పరిసర ప్రాంతాలకు ఉత్తమ రహదారి కనెక్టివిటీ లభించనుంది. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయితే రాజధాని రవాణా వ్యవస్థకు కొత్త రూపురేఖలు ఏర్పడతాయి. అదేవిధంగా, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ మార్గం గంగినేనిపాలెం అటవీ ప్రాంతం గుండా వెళ్లనుంది. అక్కడి కొండ ప్రాంతం కారణంగా రెండు టన్నెల్స్ నిర్మించాలని నిర్ణయించారు.

అమరావతి పరిధిలో నిర్మించనున్న రెండు కొత్త వంతెనలు ఎక్కడ ఉంటాయి?
ఒక వంతెన మున్నలూరు వద్ద 3.15 కిలోమీటర్ల పొడవుతో, మరొకటి మున్నంగి వద్ద 4.8 కిలోమీటర్ల పొడవుతో కృష్ణానదిపై నిర్మించనున్నారు.

ఈ వంతెనల నిర్మాణం ఏ ప్రాజెక్ట్‌లో భాగం?
అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ రెండు వంతెనలు నిర్మించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Amaravati Outer Ring Road Krishna river bridges latest news Telugu News Vijayawada development

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.