📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Amaravati: హైవే నిర్మాణంలో ప్రపంచ రికార్డులు గర్వకారణం: సిఎం చంద్రబాబు

Author Icon By Rajitha
Updated: January 13, 2026 • 10:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గిన్నిస్ రికార్డు కార్యక్రమానికి వర్చువల్ గా హాజరైన సిఎం, కేంద్ర మంత్రి

విజయవాడ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాయకత్వంలో రహదారుల నిర్మాణంలో ప్రపంచ స్థాయిలో రికార్డులను సాధించటం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) అన్నారు. బెంగుళూరు- విజయవాడ ఎకనామిక్ కారిడార్లో నాలుగు గిన్నీస్ రికార్డులు సాధించడంపై సత్యసాయి జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ “మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్ల అందరితో కలిసి ఈ ఉమ్మడి విజయంలో వర్చువల్ గా పాల్గొంటున్నాం.

Read also: AP: మంత్రి లోకేశ్ కు కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్

The world records set in highway construction are a matter of pride

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పనిచేసే వేగం, సామర్థ్యం దేశంలో అందరికీ పరిచయమే. రాజ్ పత్ ఇన్ఫ్రా కామ్ సంస్థను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వేగంగా అత్యంత పొడవైన బిటుమిన్ తో కూడిన 6 లేన్ల జాతీయ రహదారిని వేగంగా నిర్మించి గిన్నిస్ రికార్డును సాధించారు. 10,655 మెట్రిక్ టన్నుల బిటుమిన్ కాంక్రీట్ నిరంతరాయంగా వేస్తూ మరో ప్రపంచ రికార్డు సాధించారు. జనవరి 6 నుంచి 11 వరకూ ఏకబిగిన 52 కిలోమీటర్ల మేర 6 లేన్ కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించారు.

అలాగే 84.4 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారిని నిర్మించిన రికార్డును తిరగ రాశారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్సెప్రెస్ వేలు 10 వేల కిలోమీటర్ల మేర వేగంగా చేపడుతున్నారు. అమరావతి నుంచి బెంగుళూరుకు నేరుగా రోడ్డును వేయాలని నిర్ణయించాం. కొత్తగా నిర్మిస్తున్న ఈ కారిడార్ కు అమరావతి- బెంగుళూరు రోడ్డుగా దీనిని పేరు పెట్టాలని కోరుతున్నాను. బృందంగా పనిచేసి విజయం సాధించిన అందరికీ అభినందనలు తెలియచేస్తున్నాను” అని సిఎం అన్నారు.

నేషనల్ హైవే ప్రాజెక్టులు చేపట్టేందుకు ఎపి నుంచి పూర్తి సహకారం : కేంద్రమంత్రి

భగవాన్ సత్యసాయి ఆశీర్వాదంతో బెంగళూరు- విజయవాడ కారిడార్ నిర్మాణంలో ప్రపంచ రికార్డులను సాధించగలిగామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. “సత్యసాయి జిల్లాలో బెంగుళూరు- విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో 4 గిన్నీస్ రికార్డులు సాధించటంపై అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ఎక్కడా నాణ్యతలో రాజీ లేకుండా వేగంగా జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Guinness Records Highway Construction latest news national highways Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.