📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Amaravati : తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం

Author Icon By Divya Vani M
Updated: March 23, 2025 • 8:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Amaravati : తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తిరుమలను తలపించేలా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్‌లో ఈ ఆలయం దేశవ్యాప్తంగా ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారేలా ఆకర్షణీయంగా అభివృద్ధి చేయనున్నారు.ఈ ఆలయం చుట్టూ భారీ ప్రాకారం ఉండగా, ప్రధాన ముఖద్వారం వద్ద ఏడు అంతస్తుల మహారాజ గోపురం నిర్మించనున్నారు. అంతేకాదు మూడు దిశల్లో ఐదు అంతస్తుల గోపురాలు, మాడ వీధులు, పుష్కరిణితోపాటు స్వామివారికి నిత్య కైంకర్యాలు, ఉత్సవాల నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి రూ.185 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇదే ఆలయాన్ని నిర్మించేందుకు 2016లో టీడీపీ ప్రభుత్వం ముందుకొచ్చింది.

Amaravati తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం

అమరావతిలోని వెంకటపాలెం వద్ద 25 ఎకరాల భూమిని కేటాయించి, రూ. 150 కోట్ల వ్యయంతో ఆలయం నిర్మించాలని నిర్ణయించారు.2018లో టీటీడీ ధర్మకర్తల మండలి కూడా ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.అయితే కొన్ని కారణాల వల్ల ఆలయ నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రాజెక్టుకు నిర్దేశించిన రూ. 150 కోట్ల అంచనా వ్యయాన్ని కేవలం రూ. 36 కోట్లకు తగ్గించడంతో నిర్మాణ పనులు నత్తనడకన సాగాయి.ఈ క్రమంలో ప్రధాన ఆలయం, లోపలి ప్రాకారం, ఒక రాజగోపురం, ధ్వజస్తంభ మండపం మాత్రమే నిర్మించబడింది.ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం, ఆలయ నిర్మాణాన్ని మరింత వేగంగా పూర్తి చేయాలని సంకల్పించింది. తిరుపతి తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్మించేందుకు అవసరమైన నిధులు, రివైజ్డ్ ప్రణాళికలతో ముందుకెళ్లనున్నారు. త్వరలోనే పూర్తి స్థాయి నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.

AmaravatiTemple APGovernment SriVenkateswaraSwamy TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.