📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Amaravati: శ్మశాన వాటికలకేదీ స్థలం?

Author Icon By Saritha
Updated: December 2, 2025 • 12:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజధానికి భూములిచ్చిన రైతుల డిమాండ్

విజయవాడ : రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం అవుతున్న సమయంలో సెంటిమెంట్ అంశం ముందుకొచ్చింది. ఇప్పుడున్న గ్రామాల్లో(Amaravati) అంతిమ సంస్కారాలకు అవసరమైన శ్మశానవాటికలపై కొద్దికాలంగా చర్చ జరుగుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో(Chandrababu Naidu) జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని రైతులు ముందుకు తీసుకొచ్చారు. రాజధాని ఒకే నగరంగా మారుతున్న నేపథ్యంలో ఒకటి లేదా రెండుచోట్ల శ్మశానవాటికలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికోసం ఇప్పటికే. శాఖమూరు పరిధిలో అధునాతన పద్దతుల్లో శ్మశానవాటిక నిర్మించారు. అయితే రెండు రోజుల క్రితం సిఎం వద్ద జరిగిన సమావేశంలో రైతులు గ్రామాల వారి శ్మశానవాటికలు కావాలని తెలిపారు. కొన్ని గ్రామాల్లో రహదారుల పనుల పేరుతో వాటికి వెళ్లే రహదారులు తవ్వేశారని, దీనివల్ల ఇబ్బంది అవుతోందని పేర్కొన్నారు.

Read also: యాసంగికి అనువుగా వేరుశనగ

శ్మశానాల ఏర్పాటు: గ్రామాల అభిప్రాయం తప్పనిసరి

ఎంతటివారైనా చివరకు తన స్వగ్రామంలోనే అంతిమ సంస్కారాలు(Amaravati) నిర్వహించాలని కోరుకుంటారని, కనుక ఆ విషయాన్ని పరిశీలించాలని విజప్తి చేశారు. దీనిపై సీఎం స్పందించారు. వెంటనే గ్రామాల వారి ఎక్కడెక్కడ శ్మశానాలు ఏర్పాటు చేయాలి, అన్ని మతాలకూ ఒకేచోట పెట్టాలా లేక వేర్వేరుగా ఏర్పాటు చేయాలా అనే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. అలాగే గ్రామాల వారి ప్రజల అభిప్రాయం తీసుకుని నివేదిక తయారు చేయాలని, దీని ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. త్రిమెన్ కమిటీలోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుతం గ్రామాల వారీ ఉన్నాయని, తరువాత లేఅవుట్లు అభివృద్ధి చేస్తామని, వాటిల్లో వేర్వేరు గ్రామాల ప్రజలు ఉంటారని, అందువల్ల రాజధానిని యూనిట్గా తీసుకుని ఒకటి లేదా రెండుచోట్ల ఏర్పాటు చేస్తే అవసరమైతే మరొకటి పెట్టొచ్చని, గ్రామాల వారీ శ్మశానాలు అంటే సమస్య వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయినా రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం సూచించిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఇచ్చే నివేదిక ఆధారంగా ఏం చేయాలనే అంశం పరిశీలిస్తామని చెబుతున్నారు.

మూడు, నాలుగు గ్రామాలకు ఒకచోట ఏర్పాటు

రైతులు మాత్రం నాలుగు గ్రామాలకు కలిపి హిందువులకు ఒకచోట ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిసింది. కృష్ణానది ఒడ్డున గ్రామాలకు రెండుచోట్ల ఏర్పాటు చేయాలని సూచించాలని నిర్ణయించారు. అలాగే తుళ్లూరులో ఇప్పటికే హిందూ శ్మశానవాటిక ఉంది. అక్కడే మరో మూడు గ్రామాలకు కలిపి ఏర్పాటు చేయాలని సూచించినట్లు సమాచారం. శాఖమూరు పరిధిలో మోడల్ శ్మశానవాటిక కట్టిన నేపథ్యంలో మిగిలిన వాటిని కూడా అదే పద్ధతిలో నిర్మించాలని నిర్ణయించారు. పెనుమాక, ఎర్రబాలెం, ఉండవల్లి, నవులూరు గ్రామాలకు ఒకచోట, నిడమర్రు, నీరుకొండ, కురగల్లు, ఐనవోలుకు మరోచోట హిందూ శ్మశానవాటికలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం. అలాగే దళితులకు ఏ గ్రామానికి ఆ గ్రామం ఇవ్వాలని సూచించారు. వారి సంప్రదాయం ప్రకారం భూమి అవసరం ఎక్కువగా ఉంటుందని, అందువల్లే ప్రత్యేకంగా ఇవ్వాలని సీఎంకు చెప్పినట్లు తెలిసింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Amaravati Andhra Pradesh News Capital Development cm instructions Farmers Demand Latest News in Telugu Shmashana Vatikas Village-wise Cremation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.