📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Amaravati: రూ.212 కొట్లతో రాజభవన్..

Author Icon By Rajitha
Updated: October 9, 2025 • 10:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రూ.212 కొట్లతో రాజభవన్ విజయవాడ : అమరావతి Amaravati అభివృద్ధితో పాటు… రాజధానికి భూములిచ్చిన రైతులు కూడా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు Chandrababu Naidu స్పష్టం చేశారు. భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను తక్షణం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 53వ సీఆర్డీఏ CRDA అథార్టీ సమావేశం జరిగింది. మొత్తంగా 18 అంశాలపై అథార్టీ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “రాజధాని నిర్మాణ పనులు రీస్టార్ట్ చేశాం. రాజధాని కోసం భూములను త్యాగం చేసిన రైతులకే మొదటగా రాజధాని అభివృద్ధి ఫలాలు అందాలి. రాజధాని రైతులకు కౌలు చెల్లింపుల్లోనూ ఎలాంటి జాప్యం జరగకూడదు. భూములిచ్చిన రైతులకు ఎక్కడ రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని చెప్పామో… అక్కడే ఇవ్వాలి. ఏ ఊళ్లో భూములిచ్చిన వారికి ఆ ఊళ్లోనే నిర్మాణానికి సిఆర్డిఎ ఆమోదం ఎలాట్మెంట్ చేయాలి.

13న CRDA బిల్డింగ్ ప్రారంభోత్సవం

Amaravati

రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెరగాలి. సెక్రటేరీయేట్ టవర్లతో సహా ఇతర నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి. వెస్ట్ బైపాస్ రోడ్డును వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. ఏమైనా సాంకేతిక ఇబ్బందులుంటే… వాటిని వెంటనే పరిష్కరించుకుని ఖాజా టోల్ గేట్ దగ్గర జాతీయ రహదారిని చేరేలా ఉన్న రోడ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలి. కరకట్ట రోడ్డును విస్తరించాలి. మూడు నెలల్లో రాజధాని నగరాన్ని ఓ రూపునకు తీసుకురావాలి.” అని సిఎం చెప్పారు. అమరావతిలో గవర్నర్ నివాసం రాజ్ భవన్ నిర్మాణానికి సిఆర్డిఎ అథార్టీ ఆమోదించింది. రూ. 212 కోట్ల వ్యయంతో రాజ్ భవన్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. కృష్ణా నదీ ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్ భవన్ నిర్మాణం జరగనుంది. రాజ్ భవన్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ అద్భుతంగా ఉండాలని సిఎం సూచించారు. మంగళగిరి, తాడేపల్లి డేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25 శాతం నిధులను సిఆర్డిఎ ఇచ్చేందుకు అథార్టీ ఆమోదం తెలిపింది. రాజధాని ప్రాంతంలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి అథార్టీ అంగీకరించింది.

రాజధాని నగర జోనింగ్ నిబంధనల్లో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులు చేర్పులు అథార్టీ ఆమో దించింది. అమరావతి క్యాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటీవ్ ఏజె న్సీగా సిఆర్డిఎ వ్యవహరించేలా అథార్టీలో నిర్ణయించారు. హ్యాపీ నెస్ట్, ఎపి ఎన్నార్టీ ప్రాజెక్టులకు చెందిన బిల్డింగ్ పర్మిషన్ ఫీజును మాఫీ చేసేందుకు అథార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధానిలో నిర్మించే హోటళ్ల వద్ద పార్కింగ్ నిబంధనల్లోనూ స్వల్ప మార్పులు చేసేందుకు అథార్టీ అంగీకరించింది. కొండవీడు వాగు సమీపంలో నీటి ప్రవాహాల కోసం 8400 క్యూసెక్కుల సామర్థంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి అథార్టీ నిర్ణయించింది. దీంతో పాటు మరికొన్ని సాంకేతిక అంశాలకు, పరిపాలనా అంశాలకు అథార్టీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సిఎం కొన్ని సూచనలు చేశారు. భవిష్యత్తులో వాహనాల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉందని… పార్కింగ్ సమస్య లేకుండా ప్రణాళికలు చేయాలని సూచించారు.

అమరావతి రాజధానిలో రోడ్డుపై వాహనాల పార్కింగ్ చేసే పరిస్థితి లేకుండా చూడాలన్నారు. కామన్ పార్కింగ్ ప్రాంతాలు ఉండేలా ప్రణాళికలు చేయాలని సిఎం అధికారులకు చెప్పారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరితాడేపల్లి కార్పోరేషన్లు, తెనాలి మున్సిపాలిటీ, రాజధాని ప్రాంతంతో ఇంటిగ్రేట్ చేయాలని… బ్లూ గ్రీన్ అమరావతిగా రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సిఆర్డీఎ అథార్టీ సమావేశానికి మంత్రి నారాయణ, సిఎస్ కె.విజయానంద్, సిఆర్డిఎ, ఎడిసి మౌలికసదుపాయాల కల్పన శాఖ ఉన్నతాధికారులు హజరయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Amaravati Chandrababu Naidu CRDA Meeting Raj Bhavan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.