📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Amaravati : అమరావతి పునః నిర్మాణానికి నరేంద్ర మోడీ శంకుస్థాపన

Author Icon By Digital
Updated: May 3, 2025 • 11:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి పునః నిర్మాణానికి నరేంద్ర మోడీ శంకుస్థాపన: ‘వికసిత్ భారత్’కు గ్రోత్ ఇంజిన్ గా రాజధాని అభివృద్ధి

శుక్రవారం నాడు అమరావతిలో జరిగిన సభావేదిక నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాజధాని అమరావతి పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ, “అమరావతికి ఉన్న శక్తి ఆధునాతన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించగలదు” అంటూ ప్రసంగించారు. అమరావతిని “వికసిత్ భారత్‌కి గ్రోత్ ఇంజిన్”గా అభివృద్ధి చేయాలనే సంకల్పాన్ని వెలిబుచ్చారు.ఈ సందర్భంగా ప్రధాని మోడీ తెలుగులో ప్రసంగిస్తూ, “ఇవి కేవలం శంకుస్థాపనలు కాదు, ఇది ఏపీ అభివృద్ధికి ప్రగతిపథం. అమరావతి శక్తితో కూడిన స్వప్నం, ఇది కొత్త ఆంధ్రప్రదేశ్‌కి ప్రారంభ సంకేతం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం రూ.57,962 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించబడ్డాయి. గత పదేళ్లలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Amaravati : అమరావతి పునః నిర్మాణానికి నరేంద్ర మోడీ శంకుస్థాపన

Amaravati : అమరావతి పునః నిర్మాణం: అభివృద్ధి దిశగా ప్రధానమైన ప్రాజెక్టులు

రైల్వే రంగంలో ఏపీకి ఇప్పటికే రూ.9,000 కోట్లకుపైగా నిధులు కేటాయించామని, 70కి పైగా రైల్వే స్టేషన్లు ‘అమృత్ భారత్’ కింద ఆధునీకరణ చేయబడుతున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయడానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని వెల్లడించారు. 2009–2014 మధ్య కాలంలో ఉమ్మడి రైల్వే బడ్జెట్ రూ.900 కోట్లకు కూడా తక్కువగా ఉండేదని, ఇప్పుడు కేవలం ఏపీకి రూ.9,000 కోట్లు కేటాయించడం అభివృద్ధికి సూచిక అని పేర్కొన్నారు.ప్రధాని మోడీకి సభా వేదికపై ఘన సన్మానం జరిగింది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలిసి ధర్మవరం పట్టుతో అభివాదం చేశారు. ఆయనకు అమరావతికి సంబంధించిన కళంకారీ జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమానికి హాజరైన మంత్రులు, శాసనసభ్యులు, కేంద్ర మంత్రులతో ప్రధాని కరచాలనం చేశారు. కార్యక్రమం అనంతరం మోడీ విజయవాడ విమానాశ్రయం చేరుకుని, ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు.

Read More : Trump: పాకిస్తాన్‌లో నీటి కొరతపై ట్రంప్ ట్రోల్..నిజమేనా?

Amaravati Capital AP Development Breaking News in Telugu Chandrababu Naidu Google News in Telugu Latest News in Telugu Narendra Modi Paper Telugu News Polavaram Project Railway Budget Andhra Telugu News Telugu News online Telugu News Today Today news Viksit Bharat

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.