📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Amaravati: రాజధాని రైతులతో ప్రతినెలా సమావేశం: సిఆర్డిఏ కమిషనర్ కె.కన్నబాబు

Author Icon By Rajitha
Updated: November 20, 2025 • 12:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: అమరావతి (Amaravati) రాజధాని పరిధిలో రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రతినెలా మూడో శనివారం రైతుల జెఎసితో సమావేశం నిర్వహిస్తామని సీఆర్డీఏ కమిషనర్ కె, కన్నబాబు తెలిపారు. రాజధాని సమగ్ర ప్లాను అమలు, నోటిఫై చేసిన డ్రాఫ్ట్ ప్లాను, గైడ్ లైన్స్ అంశాలను వివరించేందుకు సిఆర్డి ఏ కార్యాలయంలో రైతు ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం అమరావతి బ్లూప్లాను, రోడ్లు, కాలువలు, రిజర్వాయర్లు, రోడ్ల వెంట గ్రీనరీ, నడక, సైకిల ట్రాక్, విద్యుత్ లైన్లు, మంచినీటి పైపులైన్లు వంటివి ఎలా ఉంటాయి. వాటిని ఎలా వినియోగిస్తామనే అంశాలను అధికారులు, కమిషనర్ రైతులకు వివరించారు. అనంతరం రైతులు జెఎసి తరుపున సమర్పించిన 14 డిమాండ్లను లేవనెత్తారు.

Read also: YS Jagan: బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్

Monthly meeting with capital farmers: CRDA Commissioner K. Kannababu

21, 22 తేదీల్లో మరోసారి సమావేశం

గ్రామ కంఠాలు, అబ్బురాజుపాలెం, దొండపాడు, బోరుపాలెం గ్రామాల పరిధిలో సుమారు 150 ఎకరాలకు సంబంధించిన జరీబు భూముల అంశంతోపాటు ఫోర్ ప్లేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) పెంపుదల అంశాలను ప్రస్తావించారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ కొన్నిటిని పరిష్కరించామని, గ్రామ కంఠాలు, జరీబు భూముల అంశాల సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ త్రీమెన్ కమిటీ ఇటీవల దీనిపై సమావేశం అయిందని, కొన్ని అంశాలు పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. ఈనెల 21, 22 తేదీల్లో మరోసారి సమావేశం అవుతుందని, అప్పుడు కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆ సమావేశానికి అవసరమైతే జెఎసి ప్రతినిధులను ఆహ్వానిస్తామని తెలిపారు.

3.5 అన్నా ఇవ్వాలని కోరారు

దీంతోపాటు ప్రతి నెలా మూడో శనివారం రైతుల జెఎసితో సమావేశం అవుతామని, అన్ని సమస్యలూ పరిష్కరిస్తామని చెప్పారు. అయితే గ్రీవెన్స్ పెడుతున్నారని, రైతులు ఇచ్చిన వినతి పత్రాలు చెత్త బుట్టలో వేస్తున్నారని పట్టించుకోవడం లేదని జెఎసి సభ్యులు తెలిపారు. దీనికి కమిషనర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, స్వయంగా తానే గ్రామాల్లోకి వచ్చి రైతుల వద్ద సమస్యలు తెలుసుకున్నాని, అటువంటప్పుడు పరిష్కారం చేయడానికి ఇబ్బందులు ఏమి ఉంటాయని ప్రశ్నించారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ప్రస్తుతం 2.8 ఇచ్చారని, దీన్ని 5కు పెంచాలని రైతులు కోరారు. కనీసం 3.5 అన్నా ఇవ్వాలని కోరారు. దీనికి కమిషనర్ కన్నబాబు మాట్లాడుతూ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పెంచితే ఇబ్బందులు పడతారని, బిల్డర్లతో సమస్యలు వస్తాయని తెలిపారు.

హైదరాబాద్ పది సంవత్సరాలు రాజధానిగా

వాటికి సంబంధించిన సమగ్ర సమాచారం తరువాత సమావేశంలో అన్నారు. హైదరాబాద్ నగరానికి కూడా గెజిట్ లేదని వివరిస్తానని అన్నారు. రాజధానిని గుర్తిస్తూ గెజిట్ ఇచ్చే అంశం ఇంతకాలం ఎందుకు పెండింగ్ లో ఉందని రైతులు అడిగారు. దీనికి కమిషనర్ స్పందిస్తూ ఇప్పటి వరకూ దేశంలో ఏ రాజధానికి గెజిట్ లేదని అమరావతికి అవసరం ఏముందని చెప్పారు. దీనిపై రైతులు మాట్లాడుతూ విభజన చట్టంలోనే హైదరాబాద్ పది సంవత్సరాలు రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారని, అందువల్లే గెజిట్ అని అడిగామని తెలిపారు. ఇదే అంశంపై తాము కేంద్ర హౌమమంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళితే గెజిట్ ఇచ్చేందుకు అంగీకరించారని, అయితే న్యాయ విభాగం అధికారులు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారని తెలిపారు.

వాటిని కూడా క్లియర్ చేస్తున్నామని, డిసెంబర్లో జరిగే పార్లమెంటు సమావేశాల్లో అమరావతికి సంబంధించిన బిల్లు పెట్టే అవకాశం ఉందని కమిషనర్ రైతులకు తెలిపారు. గ్రామాల్లో నుండి రోడ్లు వేసేందుకు తీసుకున్న ప్లానులో కొన్నిచోట్ల కొద్దిస్థలాన్ని వదిలేస్తున్నారని తెలిపారు. వాటిని దుకాణాలు నిర్మించుకుని వినియోగించుకునేలా ప్లాను చేస్తున్నామని కమిషనర్ రైతులకు తెలిపారు. ప్రస్తుతం రైతులకు ఇచ్చిన ప్లాట్లకు సంబంధించి సరిహద్దు రాళ్లు కనిపించడం లేదని, ఆందోళనలో ఉన్నారని రైతులు తెలవగా పనులు జరుగుతున్న నేపథ్యంలో పగ్మార్కు చూపిస్తామని అక్కడ నుండి డెవలపర్ అభివృద్ధి చేసిన తరువాత రైతులకు ఇచ్చే సమయంలో రాళ్లు వేసి ఇస్తామని కమిషనర్ అన్నారు. ఇప్పుడు సరిహద్దు రాళ్లు పెట్టినా మెరకతోలాల్సి కనిపించకుండా పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో లేఅవుట్లు అభివృద్ధి తరువాత సరిహద్దు రాళ్లను పెట్టి ఇస్తామని ఉంటుందని, అనంతరం కమిషనర్ వివరించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ భార్గవ తేజ హాజరయ్యారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Amaravati CRDA Farmers FSI latest news meeting Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.