రాజధాని అమరావతికి(Amaravati) తలమానికంగా నిలవనున్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) నిర్మాణంలో అత్యంత కీలకమైన ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను(Land acquisition) జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారికంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలిదశలో పల్నాడు జిల్లాకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ (3ఏ) విడుదలైంది. త్వరలోనే దీనిని పత్రికల్లో ప్రకటించి, ప్రజల అభ్యంతరాలను స్వీకరించనున్నారు.
Read Also: Atchannaidu:ఉల్లి రైతులకు హెక్టారుకు ₹50,000 ఆర్థిక సాయం
పల్నాడులో భూసేకరణ వివరాలు
పల్నాడు(Palnadu) జిల్లాలోని రెండు మండలాల పరిధిలో 17.230 కిలోమీటర్ల పొడవున భూమిని సేకరించనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ గెజిట్‌లో స్పష్టం చేసింది. ఓఆర్‌ఆర్ పరిధిలోకి వచ్చే భూముల సర్వే నంబర్లు, యజమానుల వివరాలను ఇందులో పొందుపరిచారు. ఈ నోటిఫికేషన్‌పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, 21 రోజుల్లోగా భూసేకరణ అధికారికి తెలియజేయాలని సూచించారు.
- అమరావతి మండలం: దిడుగు, నెమలికల్లు గ్రామాల పరిధిలో 565.87 ఎకరాలు.
- పెదకూరపాడు మండలం: ఏడు గ్రామాల పరిధిలో 607.48 ఎకరాలు.
ఈ రెండు మండలాల్లో కలిపి మొత్తం 990 మంది రైతుల నుంచి భూములను తీసుకోనున్నారు. ఇందులో పట్టా, ప్రభుత్వ, అసైన్డ్, ఈనాం భూములు ఉన్నాయి.
గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిస్థితి
అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణంలో గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు అత్యంత కీలకం కానున్నాయి. ఓఆర్‌ఆర్ ఎక్కువగా ఈ జిల్లాల నుంచే వెళ్లనుంది:
- గుంటూరు జిల్లా: అత్యధికంగా 11 మండలాల్లోని 40 గ్రామాల మీదుగా 67.650 కిలోమీటర్ల మేర భూసేకరణ జరగాల్సి ఉంది. దీనికి సంబంధించిన గెజిట్ వారం పది రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
- కృష్ణా జిల్లా: 5 మండలాల్లో 35.140 కిలోమీటర్ల మేర భూమిని సేకరించాలి.
- ఎన్టీఆర్ జిల్లా: 4 మండలాల పరిధిలో 51.120 కిలోమీటర్ల మేర భూమిని సేకరించాల్సి ఉంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా ఐదు జిల్లాలకు సంబంధించిన గెజిట్ ప్రకటనలు పూర్తి చేస్తామని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: