📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Amaravati: జల్ జీవన్ మిషన్ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు

Author Icon By Saritha
Updated: November 13, 2025 • 10:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి : జల్ జీవన్ మిషన్ (Amaravati) పనుల పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలని, అన్ని శాఖల సమన్వయంతో పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. కలెక్టర్ల నేతృత్వంలో గ్రామీణ నీటి సరఫరా శాఖతో పాటు పంచాయతీరాజ్, ఆర్అండ్్బ, రెవెన్యూ, అటవీ శాఖలను సమన్వయం చేసుకునే విధంగా ఈ పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేసుకొనే ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్ళాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి సూచించారు. ప్రతి రోజు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించడం, పనులకు ఏమైనా అడ్డంకులు ఉంటే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునేలా ఈ పర్యవేక్షణ బృందాలు పని చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగు నీరు అందించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కలల సాకారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నాయకత్వంలో అధికారులంతా నిబద్ధతతో పని చేయాలని సూచించారు. నిర్దేశిత గడువు లోపు పనులు పూర్తి చేసి స్వచ్ఛమైన, శుద్ధ జలాలు ప్రజలకు అందించేందుకు కంకణబద్దులై పని చేయాలన్నారు. అదే సమయంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.

Read also: రైతాంగానికి బాసటగా నిలుస్తాం ధాన్యం దిగుబడి కొనుగోళ్లలో రికార్డు

Amaravati: జల్ జీవన్ మిషన్ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు

జిల్లాల వారీగా జల్ జీవన్ మిషన్ పర్యవేక్షణ బృందాలు

జల్ జీవన్ మిషన్ (Amaravati) పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఐదు జిల్లాల్లో చేపట్టిన ప్రాజెక్టులకు అవసరం అయిన నిధుల సమీకరణ, పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పల్లె పల్లెకు శుద్ధ జలాలు అందించాలన్న కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లోంది. జల్ జీవన్ మిషన్ పరిధిలో ఇప్పటికే 5 జిల్లాల్లో ఇంటింటికీ తాగునీరు అందించే లక్ష్యంతో మెగా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. ప్రకాశం జిల్లా, మార్కాపురంలో ఈ బృహత్తర పథకాన్ని స్వయంగా ప్రారంభించాం. రూ.1,290 కోట్లతో మొదలు పెట్టిన ప్రాజెక్టు పూర్తి అయితే ప్రకాశం పశ్చిమ ప్రాంతంలో 21 లక్షల మందికి పైగా తాగు నీరు అందించవచ్చు. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతంగా పేరున్న ప్రకాశం పశ్చిమ భాగానికి ఈ ప్రాజెక్టు సంజీవని వంటిది. ఉభయ గోదావరి జిల్లాల్లో జల్ జీవన్ పనుల పురోగతిజల్ జీవన్ మిషన్ పనుల పురోగతిలో ఉభయ గోదావరి జిల్లాలు ముందంజలో ఉన్నట్టు అధికారులు తెలిపిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని 10 నియోజకవర్గాల్లో 15.21 లక్షల మందికి తాగు నీరు అందించాలన్న లక్ష ్యంతో పనులు మొదలుపెట్టాం. రూ.1,650 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన జల్ జీవన్ మిషన్ పనుల్లో భాగంగా ఇప్పటికే రెండు నీటి ట్రీట్మెంట్ ప్లాంటులు, 36 నీటి సంపులు, 24 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణంలో ఉన్నాయి. లక్ష 50 వేలకుపైగా ఇళ్లకు కుళాయిల కనెక్షన్లు ఇస్తాం.

గోదావరి జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ పురోగతి

పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో కూడా పనులు సంతృప్తికరంగానే ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. మిగిలిన జిల్లాల్లో కొంత వేగం పుంజుకోవాల్సి ఉంది. పనుల పురోగతికి శాఖల సమన్వయం ముఖ్యం. అయితే ఈ ఐదు జిల్లాల పరిధిలో పలు చోట్ల సర్వీస్ రిజర్వాయర్ల నిర్మాణం కోసం భూములు అప్పగించాల్సి ఉన్న విషయాన్ని అధికారులు మా దృష్టికి తీసుకువచ్చారు. పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో రోడ్ల వెంట పైప్ లైన్లు వేసేందుకు రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖల నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. కొన్ని చోట్ల ప్రైయివేటు భూములు సేకరించాల్సి ఉంది. ప్రకాశం జిల్లా పరిధిలో అటవీ శాఖ అనుమతులు కూడా పొందాల్సి ఉందని అధికారులు చెప్పారు.

2027 నాటికి ప్రాజెక్టుల పూర్తి లక్ష్యం

జల్ జీవన్ మిషన్ పనులకు మన ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. చిన్న చిన్న సమస్యల కారణంగా పనులకు ఆటంకాలు ఉంటే సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ జిల్లా కలెక్టర్లు వాటిని తొలగించే దిశగా ప్రయత్నాలు చేయాలి. జల్ జీవన్ మిషన్ పనుల పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, రోడ్లు భవనాల శాఖ, అటవీశాఖ, రెవెన్యూ తదితర శాఖలకు నుంచి అధికారులు ఇందులో సభ్యులుగా ఎంపిక చేసుకోవాలి. జిల్లా కలెక్టర్లు ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహించి పనులు వేగవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ స్థాయిలో పరిష్కారం కాని జఠిలమైన సమస్యలు ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అదే సమయంలో పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. కూటమి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పనులకు నిధుల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తోంది. ఐదు జిల్లాల పరిధిలో రూ.7,910 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులు 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని పవన్ కల్యాణ్ అన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh Chandrababu Naidu Drinking Water Projects Jal Jeevan Mission Latest News in Telugu Pawan Kalyan prakasam district Rural Development Telugu News water supply

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.