Amaravati Film Hub: త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్

Read Time:  1 min
Nandi Awards will be presented soon: Minister Durgesh
Nandi Awards will be presented soon: Minister Durgesh
FONT SIZE
GET APP

చిత్రపరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: మంత్రి దుర్గేష్

అవార్డులు అందుకున్న కళాకారులతో మంత్రి కందుల దుర్గేష్

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏప్రిల్ నుండి ఇందుకోసం అవసరమైన కార్యాచరణను ప్రారంభిస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. మంగళవారం వెలగపూడి సెక్రటేరియట్ రెండవ బ్లాక్ లోని ఛాంబర్ లో మంత్రి కందుల దుర్గేష్ (kandula durgesh) ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 పోటీల్లో గెలుపొందిన విజేతలను సత్కరించారు. అవార్డు గ్రహీతలకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా సామాజిక స్పృహతో లఘ చిత్రాలు రూపొందించిన యువ దర్శకులు, సాంకేతిక నిపుణులు, నటీనటులను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు.

Read also: AP: శ్రీవారి నెయ్యి కల్తీపై కేబినెట్ సమీక్ష

Nandi Awards will be presented soon: Minister Durgesh

Nandi Awards will be presented soon: Minister Durgesh

త్వరలో నంది అవార్డులు

ఏపీ చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా జనవరి 11న రాష్ట్రస్థాయిలో ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా ప్రతిష్టాత్మకంగా మాఎపి ఆధ్వర్యంలో తెనాలిలో ఆంధ్ర ప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 ను విజయవంతంగా నిర్వహించినందుకు ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల నిర్వాహకులు మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఆంధ్రప్రదేశ్( మా ఏపీ) వ్యవస్థాపకులు, సినీదర్శకులు దిలీప్ రాజా కృషిని కొనియాడారు. సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో చర్చించి త్వరలోనే నంది అవార్డులు, నంది నాటకోత్సవాల నిర్వహణపై ప్రకటన చేస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ హైదరాబాద్కు ధీటుగా అమరావతిని సినిమా రంగానికి కేంద్రబిందువుగా మార్చాలన్న లక్ష్యం తో కూటమి ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్–2026

సామాజిక చైతన్యంతో కూడినటువంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకులు దిలీప్ రాజా ఏపీలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయాలని నిరంతరం తపిస్తున్నారన్నారు. సినిమా రంగం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ లోని ఔత్సాహిక కళాకారులను మాత్రమే ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 203 షార్ట్ ఫిల్మ్ ఎంట్రీలు రాగా 2 వేల మంది నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నానికి చెందిన చంద్రశేఖర శకునాల తీసిన ‘మహా వృక్షం’ ప్రథమ బహుమతిని పొందగా శ్రీకాకుళంకు చెందిన శ్రీనివాసరావు ‘సింహాద్రి అప్పన్న’ ద్వితీయ బహుతిని, పాలకొల్లుకు చెందిన నవీన్ కుమార్ ‘అబద్దం వర్సెస్ నిజం’ తృతీయ బహుమతిని పొందింది.

అవార్డుల వివరాలు మరియు యువతకు ప్రోత్సాహం

ఈ సందర్భంగా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు లక్ష రూపాయల నగదును అందించారు. ఉత్తమ నటిగా సుజిత (మనం), ఉత్తమ కేరెక్టర్ నటిగా సాయి ప్రకర్ష ( అబద్ధం వర్సెస్ నిజం) నటుడు పవన్ శర్మ (మన్నుమిన్ను) బాలనటి హర్షతు న్నీసా, యంగ్ టాలెంట్ రిత్విక్ రెడ్డి (అస్ర) త్రివిక్రమ్ (డెబ్యూ డైరెక్టరు విలన్ మీసాల భాస్కర్, తెలుగు స్క్రిప్ట్ వరిశీలకులు మంజులూరి ్మపతి మాస్టర్, జగదీష్, దర్శకత్వం నరేష్ దోనె తదితరులను సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. దర్శకులు దిలీప్ రాజా మాట్లాడుతూ ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే ఏపీయువత అద్భుతాలు సృష్టించగలరని, ఆంధ్ర ప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. మరింత ప్రోత్సాహం అందిస్తే ఎవరెస్ట్ నైనా ఎక్కగలమనే దృఢ సంకల్పాన్ని విజేతల్లో నింపామని దిలీప్ రాజా పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.