అమరావతి డిజైన్లలో ఎలాంటి మార్పు లేదు – మంత్రి నారాయణ

Read Time:  1 min
అమరావతి డిజైన్లలో ఎలాంటి మార్పు లేదు - మంత్రి నారాయణ
అమరావతి డిజైన్లలో ఎలాంటి మార్పు లేదు - మంత్రి నారాయణ
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డిజైన్లలో ఎలాంటి మార్పులు లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించనున్నట్లు ప్రకటించారు. రాజధాని అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, జనవరి నుంచి నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించేందుకు సీఆర్డీఏ కృషి చేస్తుందన్నారు.

గత టెండర్ల గడువు ముగియడంతో, న్యాయపరమైన సమస్యలు రాకుండా కొత్త టెండర్లు ఆహ్వానిస్తున్నామని నారాయణ తెలిపారు. అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగుతాయని, ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ పనులు ఆగవని చెప్పారు. ప్రజల ఆదాయం రెట్టింపు చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి లక్ష్యమని, అమరావతి అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి ఆర్థిక ప్రగతిని తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.