📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Amaravati Capital: పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్సుగా రూ.3,320 కోట్లు..

Author Icon By Rajitha
Updated: February 3, 2026 • 1:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : అమరావతికి రూ.1,561 కోట్లు, పోలవరం జాతీయ ప్రాజెక్టుకు వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్లో ముందస్తు చెల్లింపు, ఆడ్వాన్సుగా కింద రూ.3,320 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన మూడు కేంద్ర బడ్జెట్లలోనూ కలిపి పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన నిధులు రూ.11,850 కోట్లు, ఈ నిధులన్నీ కేంద్రం ప్రాజెక్టుకు అడ్వాన్సుగా కేటాయించినవే. అంటే పనులు చేయక ముందే రాష్ట్ర సింగిల్ నోడల్ ఖాతాకు కేంద్రం నిధులు బదిలీ చేస్తోంది. 2025-26లో రూ.5,936 కోట్లు కేటాయించింది. ఇందులో 2024 25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్రం రూ.4,318.96 కోట్లు ఖర్చు చేసింది. అడ్వాన్సుగా ఇచ్చిన నిధుల్లో 80శాతం ఖర్చు చేశారు. అందువలన మూడో విడత అడ్వాన్సు నిధులు విడుదల చేయాలంటూ పోలవరం ప్రాజెక్ట్ అధికారులు జనవరిలో కేంద్రానికి ప్రతిపాదనలు వంపారు.

Read also: Leopard Attack: అనంతపురం జిల్లాలో మహిళపై చిరుతపులి దాడి

Rs. 3,320 crore released as an advance for the Polavaram project

తొలి దశ పోలవరం పనులకు దాదాపు పూర్తి నిధులు

అవి ఈ నెలలో రానున్నాయి. 2024-25లో కేంద్రం అడ్వాన్సుగా ఇచ్చిన రూ.5,512.40 కోట్లనే రాష్ట్రం వినియోగించడం తో గత బడ్జెట్లో కేటాయించిన 5,936 కోట్ల అవసరం పడలేదు. దీంతో ఆ కేటాయింపును రూ.3,017.40 కోట్లకు కేంద్రం తాజాగా సవరించింది. దీనిలో ప్రస్తుతం రూ.1,500 కోట్లు ఇచ్చి, అవి ఖర్చు చేసిన వెంటనే మరో రూ.1,500 కోట్లు ఇస్తామని చెబుతోంది. 2026-27 బడ్జెట్లో రూ.3,320కోట్లు కేటాయింపు చూపారు. తాజా కేటాయింపులతో పోలవరం ప్రాజెక్టుకు తొలి దశలో +41.15 మీటర్ల ఎత్తుకు నీళ్లు నిలబెట్టేలా పునరావాసం, పూర్తిస్థాయి ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు ఇచ్చినట్లవుతుంది. తొలిదశలో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైన రూ.12,157 కోట్లు కేంద్రం 2024 జూన్ తర్వాత మంజూరు చేసింది.

అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర బడ్జెట్ మద్దతు

తాజా బడ్జెట్ కేటాయింపులు కూడా కలిపి ఇంతవరకు రూ.11,850 కోట్లు ఇచ్చినట్లవుతుంది. తొలి దశకు ఇక కేంద్రం కేటాయించాల్సింది కేవలం రూ.306 కోట్లే. రాజధాని అమరావతికి రూ.1,561 కోట్లు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం లభించింది. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లలో రూ.1561 కోట్లు కేటాయించారు. ఇందులో ఏడీబీ నుంచి రూ.1128.91 కోట్లు, ప్రపంచ బ్యాంకు సంస్థ ఐబీఆర్లో నుంచి రూ. 432.09 కోట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, రాజధాని నిర్మాణాన్ని పట్టాలెక్కించిన కొన్ని నెలలకే ఏడీబీ, ప్రపంచబ్యాంకు సంయుక్తంగా రూ.15 వేల కోట్ల రుణం మంజూరు చేశాయి. వాటిలో ఆ బ్యాంకులు ఇస్తున్నది రూ.13,500 కోట్లు కాగా కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్గా .1500 కోట్లు సమకూరుస్తోంది. కేంద్రం ఇచ్చే రూ.1500 కోట్లలో 750 కోట్లు ఇప్పటికే విడుదల అయ్యాయి.

పర్యాటకం, రహదారులు, పోర్టులకు అదనపు నిధులు

ఇవే కాకుండా రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రోత్సాహమిచ్చేలా అరకులో ట్రెక్కింగ్, హైకింగ్ మార్గాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్లో తెలిపింది. పులికాట్ సరస్సులో పక్షుల్ని మరింత దగ్గర్నుంచి వీక్షించేందుకు వీలుగా బర్ట్ శాటింగ్ ట్రైల్స్ కు ప్రాధాన్యం కల్పించనుంది. గ్రామీణ రహదారుల ప్రాజెక్టుకు ఏఐఐబీ నుంచి రూ.500.99 కోట్లు. ఏపీ సహజ వ్యవసాయ సాగు ప్రాజెక్టు కోసం జీఒడీఈ నుంచి రూ.155.32 కోట్లు, రహదారులు, వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టు కోసం ఎన్డీబీ నుంచి రూ.350 కోట్ల నిధులు రానున్నాయి. కేంద్ర నౌకాయాన శాఖ నుంచి విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ కు రూ.450 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.250 కోట్లు అంతర్గత వనరుల నుంచి, రూ.200 కోట్లు ఇతర మార్గాల నుంచి సమకూరుస్తారు. గత ఏడాది కేటాయించిన రూ.730 కోట్లతో పోలిస్తే ఇది తక్కువే! “రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో రూ.1.561 కోట్లు కేటాయించారు. కీలక ప్రాజెక్టులైన పోలవరానికి నిధులు కేటాయించారు. 2025-26 బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు కేటాయించినా అంచనాల సవరణలో రూ.3,017.20 కోట్లకు తగ్గింది. 202627 బడ్జెట్లో రూ.3,320.39 కోట్లు కేటాయించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Amaravati Capital Andhra Pradesh latest news Polavaram Project Telugu News Union Budget 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.