📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Amaravati: రాజధానిలో 6 లేన్ల కారిడార్

Author Icon By Rajitha
Updated: October 6, 2025 • 10:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి Amaravati నుంచి జాతీయ రహదారికి కనెక్టివిటీ విజయవాడ : ఎపి రాజధాని అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డు (ఇ3)ని జాతీయ రహదారి వరకూ విస్తరించేందుకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎడిసిఎల్) కొత్త ప్రణాళికను రూపొందిస్తోంది. దొండపాడు నుంచి వెంకటపాలెం వరకూ నిర్మించిన ఈ రహదారిని అక్కడ నుండి మణిపాల్ వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిలో కలపనున్నారు. 45వ ప్యాకేజీలో భాగంగా రెండోదశలో సీతానగరం నుండి మణిపాల్ ఆస్పత్రి వరకూ సుమారు రూ.613.30 కోట్లతో దీనిలో 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్లు, బ్రిడ్జ్లు, అండర్పాస్లు నిర్మించనున్నారు. 2024 చివర్లో ప్రభుత్వం ఈ అంచనాలు రూపొందించింది. అయితే ప్రాజెక్టులో స్వల్ప మార్పులతో గతంలో ఉన్న అంచనాలు సవరించేందుకు ప్రభుత్వం జిఓ 1089 విడుదల చేసింది. ఎపిసిఆర్డిఎ అదనపు కమిషనర్ చైర్మన్గానూ, ఎడి సిఎల్ చీఫ్ ఇంజినీరు మెంబర్ కన్వీనర్ గానూ వ్యవహరించే ఈ కమిటీలో ఆర్అండ్బి, పబ్లిక్ హెల్త్, ఎపిసిఆర్డిఎ ఇఎన్సీలు, గుంటూరు ఆర్టిఒ సభ్యు లుగా ఉంటారు.

AP Govt: చిన్నారుల మృతి ఘటనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌

Amaravati

ఎలివేటెడ్ కారిడార్

రెండోదశలో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ పనులకు గతంలో నిర్ణయించిన ధరలు సరిపోవని వాటిని సవరించాలని నిర్ణయించి వెంటనే కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ రోడ్డును సీతానగరం నుండి ఎన్టీఆర్ NTR కట్ట వరకూ ఆధునిక పద్ధతుల్లో వైర్ బ్రిడ్జి, ఎలివేటెడ్ కారిడార్ రూపంలోనూ, మణిపాల్ ఆస్పత్రి వద్ద జాతీయ రహదారికి అండర్పస్ నిర్మించి జాతీయ రహదారిలో ఇంటర్చేంజ్ పద్ధతిలో నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. ఈ ప్లానులో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

అమరావతిలో కొత్త రహదారి ప్రాజెక్ట్ ఏమిటి?
అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్‌ (E3) ను జాతీయ రహదారి వరకూ విస్తరించే ప్రాజెక్ట్ ఇది

ఈ రహదారి ఎక్కడి నుంచి ఎక్కడివరకు విస్తరించనున్నారు?
దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు ఉన్న రహదారిని, మణిపాల్ వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిలో కలపనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

6 lane corridor ADC Amaravati AP Government Breaking News elevated road latest news National Highway Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.