📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Theaters Bandh : ‘ఆ నలుగురి’లో నేను లేను’- అల్లు అరవింద్

Author Icon By Sudheer
Updated: May 26, 2025 • 5:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ బంద్ వివాదం (Theaters Bandh) రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind) స్పందించారు. ‘‘ఇప్పుడు ప్రతిచోటా ‘ఆ నలుగురు’ అనే మాట వినిపిస్తోంది. నేను ఆ నలుగురిలో లేను. ఆ వ్యాపారం నుంచి బయటకు వచ్చేశాను. తెలంగాణాలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు. ఏఏఏ మల్టీప్లెక్స్ తప్ప రెండు రాష్ట్రాల్లో 15 థియేటర్లు కూడా లేవు. అవి కూడా త్వరలో ఉండవు’’ అని స్పష్టం చేశారు. తనను అనవసరంగా ఈ వివాదంలో లాగవద్దని మీడియాను కోరారు.

పవన్ సినిమా ముందు బంద్ అంటే దుస్సాహసమే

పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సమయం లో థియేటర్ల బంద్ పిలుపు దుస్సాహసమని అల్లు అరవింద్ అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమకు సహకారం చేస్తున్న వ్యక్తి అని, ‘కల్కి 2898 ఏడి’ టికెట్ ధరలు పెంచే విషయంపై చర్చించేందుకు కూడా పవన్ దగ్గరికి నిర్మాతలంతా వెళ్లారని గుర్తు చేశారు. అప్పుడే ఆయన సీఎం‌ని కలవాలని సూచించారంటూ వివరించారు. కానీ, ఆ సలహా ఫలంగా మారలేదని అన్నారు.

పవన్ లేఖలోని ప్రశ్నలు సబబే

పవన్ కళ్యాణ్ కార్యాలయం విడుదల చేసిన లేఖను తాను చదివానని, అందులోని ప్రశ్నలు సరైనవేనని అల్లు అరవింద్ అన్నారు. ‘‘పవన్ కళ్యాణ్ బాధలో నిజముంది. థియేటర్లు మూసివేయాలన్నది ఏకపక్ష నిర్ణయం. అందుకే నేను ఫిలిం ఛాంబర్ సమావేశాలకు హాజరుకాలేదు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేష్ స్పందన చాలా సమంజసం’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వివాదంలో కీలక థియేటర్ హోల్డర్లైన ‘దిల్’ రాజు, సురేష్ బాబు ఎలా స్పందిస్తారు? అనేదే ఇప్పుడు సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన అంశంగా మారింది.

Read Also : Miss World 2025 : మిస్ ఇంగ్లండ్ ఆరోపణలపై ప్రభుత్వం విచారణ

Allu Aravind Google News in Telugu Pawan Kalyan theatres bandh tollywood

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.