ఆంధ్రప్రదేశ్‌లో (In Andhra Pradesh) అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Sharmila) విమర్శించారు. తిరుపతి జిల్లాలో జరిగిన విస్తృత స్థాయి సమావేశం అనంతరం, ఆమె సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ రాష్ట్రంలో అధికారులపై ధైర్యంగా ప్రశ్నించగల పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని షర్మిల ధీమాగా ప్రకటించారు. కేంద్రంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ ఇవ్వగల సమర్థత కూడా కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆమె స్పష్టం చేశారు.
విభజన హామీల నెరవేరు కాంగ్రెస్‌తోనే సాధ్యమని హామీ
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేరలేదు. రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి వంటి కీలక సమస్యలు అధికారంలోకి కాంగ్రెస్ వస్తేనే పరిష్కారం అవుతాయి, అని షర్మిల పేర్కొన్నారు. ఈ అంశాలపై మిగిలిన పార్టీలు కేవలం నాటకాలే చేస్తాయని ఆమె ఆరోపించారు.
పార్టీ లోపలి విభేదాలను పక్కనపెట్టి ముందుకు పోదాం
షర్మిల కార్యకర్తలకు సూచిస్తూ, పార్టీలో చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టి ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేద్దాం. మన లక్ష్యం రాష్ట్ర ప్రయోజనాలు. వాటిని సాధించేందుకు ఏకతాటిపై పనిచేద్దాం, అని పిలుపునిచ్చారు.తాను అగ్రశ్రేణిలో ఉన్నా కానీ, ప్రతి కార్యకర్త భాగస్వామిగా భావిస్తానని షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే శక్తి ఒక్క కాంగ్రెస్‌కే ఉంది. ప్రజలు మళ్లీ మనపై విశ్వాసం ఉంచేలా పనిచేద్దాం అని ఆమె జోష్ భరితంగా తెలిపారు.
Read Also : Chandrababu : ఆటోడ్రైవర్లకు ఆర్థికసాయం: సీఎం చంద్రబాబు