📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Alladurgam junior college : కళాశాలలో ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు జిల్లా అధికారి విచారణ అల్లాదుర్గం

Author Icon By Sai Kiran
Updated: January 7, 2026 • 7:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Alladurgam junior college : అల్లాదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్‌, అధ్యాపకుల మధ్య ఏర్పడిన విభేదాలపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) మాధవి బుధవారం విచారణ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ సత్తయ్య తమను అకారణంగా వేధిస్తున్నారని అధ్యాపకుడు శంకర్ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఫిర్యాదుకు మద్దతుగా కొందరు గ్రామస్తులు కళాశాల వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న సీఐ రేణుకా రెడ్డి, ఎస్‌ఐ శంకర్ కళాశాలకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. రాజకీయాలు చేయవద్దని గ్రామస్తులను హెచ్చరించి అక్కడి నుంచి పంపించారు.

ఈ నేపథ్యంలో డీఐఈఓ మాధవి ప్రిన్సిపాల్‌, అధ్యాపకులను (Alladurgam junior college) కూర్చోబెట్టి విచారణ చేపట్టారు. ఇకపై కళాశాలలో ఇలాంటి సంఘటనలు జరగకుండా క్రమశిక్షణ పాటించాలని, తప్పిదాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇరువురు కలిసి పనిచేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన విద్య అందించేందుకు అందరూ కృషి చేయాలని డీఐఈఓ సూచించారు. ఇకపై కళాశాలలో సమన్వయంతో పనిచేస్తారని తెలిపారు.

Read also: Kamareddy Crime: భార్య, బిడ్డలను పోషించలేక తండ్రి ఆత్మహత్య

ప్రిన్సిపల్‌పై ఆరోపణలు అవాస్తవం – గ్రామస్తుల వినతిపత్రం

కళాశాల ప్రిన్సిపాల్ సత్తయ్య నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ కళాశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని పలువురు గ్రామస్తులు డీఐఈఓ మాధవికి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం, ఎన్సీసీ కార్యక్రమాలు, ఇతర విద్యా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని వారు పేర్కొన్నారు.

కొంతమంది అధ్యాపకులు కులపరమైన కారణాలతో ప్రిన్సిపాల్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అవన్నీ నిరాధారమని గ్రామస్తులు తెలిపారు. కళాశాల అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఇలాంటి ఫిర్యాదులు చేయడం సరికాదని, ప్రిన్సిపాల్‌కు న్యాయం చేయాలని వారు డీఐఈఓను కోరారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Alladurgam junior college Breaking News in Telugu college dispute Telangana DIO inquiry district education officer inquiry faculty complaint college Google News in Telugu government junior college issue Latest News in Telugu principal complaint Telangana education news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.