हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Tourism Project: అట్టహాసంగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం

Sharanya
Tourism Project: అట్టహాసంగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం

త్వరలో గోదావరి పరివాహాక ప్రాంతాలకు కొత్త సొబగులు

రాజమండ్రి: రూ.94.44 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించానున్న అఖండ గోదావరి ప్రాజెక్టు (Godavari Project) కు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ, మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) , స్థానిక ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారు. త్వరితగతిన అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తికి చర్యలు తద్వారా 8వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి 2035నాటికి 35 లక్షల పర్యాటకులు రావడమే లక్ష్యంగా ప్రాజెక్టు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఉంటుందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీలో టూరిజంల ప్రాజెక్టులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ, మంత్రి కందుల దుర్గేష్ లుకృషి చేస్తున్నారని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఏపీకి దాదాపు రూ.450 కోట్లతో 7 టూరిజం ప్రాజెక్టులు మంజూరు .. పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో ఏపీలో పర్యాటకాభివృద్ధి జరుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

2047 పుష్కరాల నాటికి గోదావరి ప్రాజెక్టు పూర్తి


అఖండ గోదావరి ప్రాజెక్టుతో అధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక రాజధాని రాజమహేంద్రవరం, పరిసర ప్రాంతాలకు మరింత శోభ తెస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం నుండి నిర్మాణం వైపు నడిపించే దిశ లో కూటమి ప్రభుత్వం టూరిజానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న జిల్లా ఇంచార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. వికసిత్ రాజమహేంద్రవరంలో భాగమే అఖండ గోదావరి ప్రాజెక్టు..2047 పుష్కరాల నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తి చేసి రాజమండ్రిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని పురందేశ్వరీ హామీ ఇచ్చారు.అఖండ గోదావరి ప్రాజెక్టు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.


రాజమహేంద్రవరం: రూ.94.44 కోట్లతో రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ చెంతన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ, మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో అట్టహాసంగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. తొలుత సభావేదిక ఆవరణలో అఖండ గోదావరి పర్యాటక విశేషాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికారులు సందర్శించారు. అంతకుముందు రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయంలో మంత్రి కందుల దుర్గేష్ కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజమండ్రికి తొలిసారి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా అఖండ గోదావరి ప్రాజెక్టుతో చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై అంతర్జాతీయ, దేశ, రాష్ట్ర పర్యాటకులతో పర్యాటక శోభను సంతరించుకోనుందని వక్తలు ఉద్ఘాటించారు. 2047 పుష్కరాల నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తి అయి పర్యాటకులకు అందుబాటులోకి రానుందన్నారు.తద్వారా స్థానికంగా హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, ఇతర రంగాలు విస్తరించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 8వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశముందన్నారు.

Read also: AP ration : రేషన్ షాపుల వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ ఏర్పాటు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870