📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్

News Telugu: Akhanda 2: అఖండ జోష్.. ఎమ్మెల్యేలతో అనంత వీధుల్లో ఫ్యాన్స్ సందడి

Author Icon By Rajitha
Updated: December 12, 2025 • 11:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనంతపురంలో గురువారం రాత్రి అఖండ–2 విడుదల సందడి అమాంతం పెరిగిపోయింది. నందమూరి బాలకృష్ణపై (Nandamuri Balakrishna) అభిమానంతో ఇద్దరు ఎమ్మెల్యేలు స్వయంగా ర్యాలీల్లో పాల్గొని అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఆటోలు, బుల్లెట్లు, డీజే డ్రమ్స్‌తో అనంత వీధులంతా సందడిగా మారాయి.

Read also: Prakasam district: టోల్ గేట్ల వద్ద మోసం: నకిలీ MLA స్టిక్కర్‌తో తిరుగుతున్న డ్రైవర్ అరెస్ట్

Akhanda 2

టపాసులు పేలుస్తూ ఘనంగా వేడుకలు

అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తన కార్యాలయం నుంచి గౌరీ థియేటర్ దాకా భారీ బైక్‌ ర్యాలీ చేశారు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు రాంనగర్‌ నుంచి త్రివేణి థియేటర్ వరకు ఆటో ర్యాలీతో అభిమానులను అలరించారు. బాలయ్య ఫోటోలు, అఖండ జెండాలు పట్టుకుని పాల్గొన్న అభిమానులు టపాసులు పేలుస్తూ ఘనంగా వేడుకలు జరిపారు.

అభిమానుల సందడి గరిష్ఠ స్థాయికి

తరువాత ఎమ్మెల్యేలు ఇద్దరూ గౌరీ థియేటర్‌ వద్ద శివలింగాభిషేకం చేసి విజయవంతమైన రీలీజ్ కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎన్‌బీకే ఫ్యాన్స్ నాయకుడు గౌస్ మొద్దీన్ ఆధ్వర్యంలో బాలయ్య చిత్రపటానికి హారతులు పెట్టారు. ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్‌ జగన్‌, మదమంచి శ్రీనివాసులు సహా పలువురు అభిమానులు కూడా పాల్గొన్నారు. బెనిఫిట్ షో గురువారం రాత్రే ఉండటంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి గరిష్ఠ స్థాయికి చేరుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Akhanda 2 ananthapur Balakrishna latest news NBK fans Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.