📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Airports: నాలుగు విమానాశ్రయాల అభివృద్ధికి వెయ్యి కోట్ల రుణం

Author Icon By Sharanya
Updated: July 15, 2025 • 10:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: రాష్ట్రంలో కొత్తగా నాలుగు విమానాశ్రయాల (Airports) అభివృద్ధికి రూ.1000 కోట్లు రుణం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి (Development of airports) కార్పొరేషన్ లిమిటెడ్ కు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది చేసింది. హడ్కో ద్వారా తీసుకోనున్న వెయ్యి కోట్ల రుణానికి ప్రభుత్వం హామీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల (Airports) అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తూ ఆదేశాలిచ్చింది.

కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, అమరావతి విమానాశ్రయాల అభి వృద్ది కోసం ఈ రుణాన్ని వినియోగించనున్నారు. భూసేకరణ, మోలిక సదుపాయాల ఖర్చులు, వయబులిటీ గ్యాప్ ఫండ్, అత్యవసర వినియోగం కోసం రుణాన్ని వినియోగించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర మోలిక సదుపాయాలు, పెట్టుబడి విభాగం కార్యదర్శి ఎన్.యువరాజ్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7 విమానాశ్రయాలు (7 airports) ఉన్నాయి. విశాఖ, తిరుపతి, కడప, రాజమండ్రి, గన్నవరం విమానాశ్రయాలను ఎయిర్పోర్ట్ అథా రిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. కర్నూల్ ఎయిర్పోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండగా పుట్టపర్తిలో ప్రైవేటు ఎయిర్ స్ట్రిప్ ఉంది. వీటికితోడు భోగాపురంలో అంతర్జాతీయ విమా నాశ్రయం సిద్ధమవుతోంది. అయితే పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మరో 7 కొత్త ఎయిర్ పోర్టులు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యించింది. అందులో భాగంగా కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని అన్నవరం, ఒంగోలులో నూతన ఎయిర్ పోర్టులను నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు ఎయిర్పోర్టుల విస్తరణ, నిర్మాణం, కొత్త విమానాశ్రాయాల కట్టడంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా నేడు కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, అమ రావతి విమానాశ్రయాల అభివృద్ధి కోసం వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ విమా నాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్క ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

ఏపీలో రెండు గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణా నికి సర్కార్ సన్నాహాలు ప్రారంభించింది. వీటిలో ఒకటి రాజధాని అమరావతిలో కాగా, మరొకటి శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయాలని సంకల్పిం చింది. ఇందుకు సంబంధించి ప్రీఫీజిబిలిటీని పరిశీలించేందుకు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసా ధ్యాల నివేదిక (టీఈఎస్ఆర్) రూపొందించేందుకు కన్సల్టెంట్ల నియామకానికి ఆంధ్రప్రదేశ్ విమా నాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీ) టెండర్ల ప్రక్రియ సైతం పూర్తి చేసింది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు ఏ ప్రాంతం అనుకూలమో కూడా కన్సల్టెన్సీ సంస్థే సూచించాలని నిబంధనల్లో తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో విమానాశ్రయాన్ని ఈశాన్య దిశలో, నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో, సముద్ర తీరానికి సమీపంలో నిర్మించనున్నట్లు ఏపీఏడీసీ వివరించింది. ఈ రెండు ఎయిర్పోర్టుల నిర్మా ణం, నిర్వహణను ప్రభావితం చేసే సాంకేతిక, ఆర్థిక అంశాలను కన్సల్టెన్సీ సంస్థలు గుర్తించాలని పేర్కొంది .

నాలుగు విమానాశ్రయాల అభివృద్ధికి ఎంత మొత్తం రుణం మంజూరైంది?

మొత్తం ₹1,000 కోట్లు (వెయ్యి కోట్ల రూపాయలు) రుణంగా మంజూరైంది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Chandrababu Naidu : చంద్రబాబులా రెండుగంటలపాటు నిల్చుని మాట్లాడలేరు: అనిత

Airport development Airport infrastructure Breaking News Four airports upgrade latest news Telugu News ₹1000 crore loan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.