📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Air pollution: భారతను వణికిస్తున్న వాయు కాలుష్యం

Author Icon By Sudha
Updated: January 6, 2026 • 3:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వాయు కాలుష్యం భారతన్ను వణికిస్తోంది. స్వచ్ఛమైన గాలి పీల్చలేని దుస్థితి ఏర్పడింది. ప్రధానంగా పట్టణా ల్లోని పరిస్థితి దయనీయం. దేశ రాజధాని అయిన ఢిల్లీలో వాయు కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. ఈ మధ్యకాలంలో సాయంత్ర వేళల్లో ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్లో 300 నుండి 450 వరకు సూచిస్తోంది. తీవ్రమైన హాని కలుగచేస్తుందనే దానికి సూచిక. దేశ రాజధానిలో వీఐపీలు, ఉన్నత వర్గాలు ఏయిర్ ఫిల్టర్లతో కొంత ఉపశమనం పొందుతున్నా మధ్య, సాధారణ పౌరులు వాయు కాలుష్యం (Air pollution)తో మృతి చెందుతు న్నారు. తీవ్రమైన ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన దాఖలాలు లేదు. శ్వాస సంబంధిత వ్యాధులతో ఆసుపత్రిలో చిన్నారులు అల్లాడుతున్నా చలనం లేకుండాపోయింది. వాయు కాలుష్యం వల్ల గుండె, ఊపిరి తిత్తులు, మెదడు సంబంధించిన వ్యాధుల భారిన పడుతు న్నారు. దేశవ్యాప్తంగా ఏటా రెండు మిలియన్ల వరకు మృతి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతు న్నాయి. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనంలేదు. గత పార్ల మెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు వాయుకాలుష్యంపై చర్చకు పట్టుబట్టినా ఫలితం లేకుండా పోయింది. లేబర్ కోడ్ ల అమలు, జీ రాం జీ లాంటి చట్ట సవరణలపై ఉన్న శ్రద్ధ వాయు కాలుష్య నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం చూపకపోవడం విడ్డూరం. వాయు కాలుష్యం ఢిల్లీలో కోరలు చాస్తుండగా దేశంలోని వివిధరాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు, రాజధానీల్లోనూ రోజురోజుకు పెరుగుతూపోతుంది. భారత్లో నేడు నీటి కాలుష్యం (Air pollution)తోపాటు ఏయిర్ పొల్యూషన్ పెద్ద సవాల్గా మారింది. ప్రభుత్వాలు ఓటుబ్యాంకు రాజకీయా లకు ఇచ్చినంతగా ప్రజాసంక్షేమంపై చూపడం లేదు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సెంట్రల్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డు సుప్తావస్థలో ఉంది. అధికార యంత్రాంగం కాలుష్య నియంత్రణా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పైగా వాయుకాలుష్యం పెద్దసమస్యే కాదన్నట్లుగా పొల్యూ షన్ కంట్రోల్ బోర్డు వ్యవహరిస్తోంది. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో నియంత్రణ చర్యలపై కనీసం సూచనలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.

Read Also: India: ఇరాన్ కు వెళ్లవద్దు..కేంద్రం సూచన

Air pollution

దేశవ్యాప్తంగా 254 ప్రాంతాల్లో ఏయిర్ క్వాలిటీ కొలిచే కేంద్రాలను ఏర్పాటు చేసి సగటున రోజు వారి బులిటెన్ విడుదల చేసే వరకు పని చేస్తున్నట్లు తెలు స్తుంది. ఏక్యూఐ ప్రపంచ సూచికతో పోలిస్తే మన సీపీసీబీ కేటగిరీలో వాయు తీవ్రతను కొంత తగ్గించి సూచిస్తున్నట్లు స్పష్టమోతుంది. తెలంగాణలోనూ రోజురోజుకు వాయు కాలుష్యం పెరుగుతోంది. పెరుగుతోన్న వాహనాలకు తోడు అటవీ ప్రాంతం తగ్గడమూ కారణంగా తెలుస్తుంది. పల్లెలు, పట్టణాలు కాంక్రిట్ జంగల్గా మారాయి. రాష్ట్రంలో అడవీ ప్రాంతం 24శాతం వరకు ఉన్నట్లు ఆశాఖ అధికారులు లెక్క లు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నట్లు విమర్శలున్నాయి. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ, ఇతర అభివృద్ధి నెపంతో భారీ వృక్షాలను కొట్టివేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి నగరాల్లో వందేళ్లకు పైగా ఉన్న వృక్షాలను తొలగించారు. రోడ్లకు ఇరు వైపులా మొక్కలు నాటినప్పటికీ.. అవి విద్యుత్ స్తంబాల కింద ఉండడంతో ఎప్పటికప్పుడు అవి పెరగకుండా కొట్టివేస్తున్నారు. రోడ్డు మధ్యలో కోనోకార్పస్ మొక్కలు నాటగా అవి అనారోగ్యాన్ని కలుగ జేస్తున్నట్లు వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అటవీ సంపదను 33 శాతం పెంచే లక్ష్యంతో హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 10 శాతం గ్రీన్ బడ్జెట్గా ప్రకటించింది. 2022 23 నాటికి 14, 965 నర్సరీలను ఏర్పాటు చేసి.. 270 కోట్ల మొక్కలు నాటినట్లు చెప్పుకుంది. ఇందుకు సుమారు రూ. 10వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చారు. క్షేత్ర స్థాయిలో ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఈ మొక్కలన్నీ నాటి ఉంటే.. వాటిని సంరక్షించి ఉంటే.. తెలంగాణ ఇలా ఉండేది కాదనేది నగ్న సత్యం.
-చిలగాని జనార్ధన్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

air pollution Breaking News Environmental Crisis health issues india latest news Smog Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.