AI Summit: యూత్ కాంగ్రెస్ ఆందోళనపై మంత్రి లోకేశ్ ఆగ్రహం

Read Time:  1 min
AI Summit: యూత్ కాంగ్రెస్ ఆందోళనపై మంత్రి లోకేశ్ ఆగ్రహం
FONT SIZE
GET APP

AI Summit: భారతదేశ రాజధానిలో ప్రతిష్ఠాత్మక నిర్వహించిన “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026” లో కొందరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలతో గందరగోళం సృష్టించడంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్రంగా స్పందించారు. ఈ చర్య దేశ ప్రతిష్ఠను ప్రపంచం ముందు మసకబార్చేలా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: artificial intelligence : ఎఐపై నియంత్రణ లేకపోతే వినాశనమే!

AI Summit: యూత్ కాంగ్రెస్ ఆందోళనపై మంత్రి లోకేశ్ ఆగ్రహం
AI Summit: Minister Lokesh angry over Youth Congress agitation

రాజకీయాలకు ఇది వేదిక కాదు.. మంత్రి లోకేశ్

ఈ మేరకు లోకేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏఐ సూపర్ పవర్‌గా భారత్ ఎదుగుతున్న తీరును ప్రదర్శించేందుకు ఈ సదస్సు ఒక గొప్ప అవకాశం. అలాంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చడం ద్వారా ప్రపంచం ముందు మనందరి ప్రతిష్ఠను తగ్గించారు. ఇది దిగ్భ్రాంతికరం, విచారకరం అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక ఆవిష్కరణలు మరియు దేశాభివృద్ధి గురించి చర్చించాల్సిన చోట రాజకీయ నిరసనలు తెలపడం ఏమాత్రం సమర్థనీయం కాదని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయ విభేదాలు ఏవైనా ఉంటే అవి దేశీయంగా చూసుకోవాలని, అంతర్జాతీయ సదస్సులను అడ్డుకోవడం ద్వారా దేశ ప్రతిష్ఠను పణంగా పెట్టవద్దని లోకేశ్ సూచించారు. దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో దూసుకుపోతున్న తరుణంలో అందరూ సమన్వయంతో ముందుకెళ్లాలని ఆయన కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.