📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AI Groundwater Estimation: ఏఐతో భూగర్భ జలాల అంచనాలు

Author Icon By Saritha
Updated: February 26, 2026 • 12:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సభ్యులు ఎన్. వరదరాజ్

AI Groundwater Estimation: భూగర్భజల వనరుల అంచనా, సమర్థనిర్వహణ, వినియోగానికి కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సాంకేతిక పద్ధతులను విస్తృతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు (సిజిడబ్ల్యూబి) సభ్యులు ఎన్. వరదరాజ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూగర్భ జలాల రంగంలో అద్భుతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

సీజిడబ్ల్యూబి ఆధ్వర్యంలో విజయవాడలోని ఓ హోటల్లో రాష్ట్రానికి చెందిన భూగర్భ జలాల డేటా, అక్విఫర్ (జలధార పొరలు) మ్యాపింగ్ ఫలితాల ప్రచారంపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ జరిగింది. దీనిలో 150 మందికి పైగా జిల్లా, రాష్ట్రస్థాయి సమన్వయ శాఖాధికారులు, భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read Also: AP Tax QR Code: ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్.. పన్నుల చెల్లింపు ఇక మరింత ఈజీ!

AI Groundwater Estimation: Groundwater estimation with AI

ఏఐ ఆధారిత నమూనాలు

ఈ సందర్భంగా రాష్ట్ర డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ – 2025, నేషనల్ ఆక్విఫర్ మ్యాపింగ్ అండ్ మేనేజ్మెంట్ నివేదికలను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సభ్యులు (ఇంజనీరింగ్) ఎన్. వరదరాజ్ మాట్లాడుతూ వాతావరణ మార్పులు, వర్షపాతంలో లోపాలు, అధిక వినియోగం కారణాలతో భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో శాస్త్రీయ ఆధారిత డేటా సేకరణ, విశ్లేషణ అవసరమన్నారు. ఏఐ ఆధారిత నమూనాల ద్వారా భూగర్భ జలాలల నిల్వలు, రీచార్జ్ సామర్థ్యం, వినియోగ ధోరణులు తదితర అంశాలను ముందస్తుగా ఖచ్చితత్వంతో అంచనా వేయవచ్చన్నారు. “ఇన్- గ్రెస్” సాఫ్ట్వేర్ వినియోగం ద్వారా భూగర్భ జల వనరుల నిర్వహణ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AI in Ground water Aquifer Mapping AP CGWB Varadaraj Latest News in Telugu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.