📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Agriculture : వ్యవసాయంలోనూ సంస్కరణలు అవసరం

Author Icon By Sudha
Updated: December 19, 2025 • 4:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి కొద్దో గొప్పో ప్రాముఖ్యత ఇచ్చే పనిలో భాగంగా పీఎం కిసాన్ నిధి, రైతు భరోసా, కొన్ని పంటలకు మాత్రమే ఇస్తున్న నష్ట పరిహారం, రైతు పండించే పంటలకు అతి కొద్దిశాతం మాత్రమే ఇచ్చే సబ్సిడీ విత్తనాలు, ట్రాక్టర్, వ్యవసాయ (agriculture)పరికరాల కొనుగోలు వంటి వాటిపై అరకొరగా మాత్రమే రైతులకు సబ్సిడీగా అందజేస్తున్నారు అనే మాట సత్య దూరం కాదు. అయితే దేశ వ్యాప్తంగా 60 శాతానికి పైగా ప్రజానీకం ఇప్పటికి వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నేపథ్యంలో అయా రంగ అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా శ్రద్ధ కనబరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా వున్న రైతులలో చాలా మటుకు ఎక్కువ భాగం చిన్న, సన్నకారు రైతులు వున్న నేపథ్యంలో వారికున్న అరకొర ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి పెన్షన్ సౌకర్యం కలిగించడంతో పాటు ఏదేని కుటుంబాన్ని పోషించే రైతు అనుకోని పరిస్థి తుల్లో ఏదేని ప్రమాదం వల్లనో లేక అన్యూహమైన రీతిలో ఆ రైతుకు మరణం సంభవించినప్పుడో ఆ రైతు తరపున ఆ కుటుంబానికి ఆర్థిక వెసులుబాటు లభించేలా ఆ రైతు తరపున లైఫ్ ఇన్సూరెన్సు సౌకర్యం మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడితే వారి జీవితాలకు ఎనలేని భరోసా ను కల్పించిన వారవుతారు. అదేవిధంగా ఒక చిన్న, పెద్ద కుటుంబాన్ని పోషించే రైతు దురదృష్టవశాత్తు అనారోగ్యం పాలు అయితే ఆయనపై ఆధారపడిన కుటుంబం ఆ రైతు కు వచ్చిన జబ్బును నయం చేసేందుకు తగినంత ఆర్థిక వనరులు వారి దగ్గర లేకపోవొచ్చు. అలాంటి సందర్భాలలో హెల్త్ ఇన్సూరెన్సు అత్యంత అవశ్యకం. ఈ స్కీమ్ సైతం అమలు చేసేందుకు కేంద్రప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవ శ్యకత ఎంతైనా వుంది. ఇంకా చెప్పుకుంటూపోతే రాత్రనక, పగలనక, వాననక, ఎండనక ఆరుగాలాలు శ్రమించి పం డించే పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర కృషి సల్పాల్సిన గురుతర బాధ్యత వారి భుజస్కంధాలపై ఎంతైనా వుంది.

Read Also: AP: ఉపాధి హామీ పథకంలో కఠిన నిర్ణయం.. భారీగా జాబ్ కార్డులు రద్దు

Agriculture

అదేవిధంగా రైతు సోద రులు పంటలు విత్తే విషయంలో వారు తీసుకునే విత్తనాల పై సబ్సిడీ సౌకర్యం, అలాగే పంటవేసిన తరువాత వాటిని కాపాడే నిమిత్తమై వాడే బయో ఫర్టిలైజర్, బయో ఫెస్టిసైడ్స్ మందులపై సబ్సిడీ సౌకర్యాన్ని ప్రవేశపెడితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సోదరులకు ఎంతో మేలు చేసిన వారవు తారు. ఇలాంటి సౌకర్యాలు అన్ని ప్రతి రైతు పొందేలా వారికి ఒక ప్రత్యేక కార్డును అందజేస్తే ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతిఒక్క రైతు వీటివల్ల లబ్ది పొందగలడు. అన్నింటికి మించి ఇప్పటి కాలంలో వ్యవసాయరంగం అనేది మోయలేని భారం వంటిది అని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఆయారంగం వైపు వెళ్లాలంటేనే జంకే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్న నేపథ్యంలో, ప్రస్తుత యువతరం సైతం ఈ రం గంపై అనాసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఈ విషయంలో ఒకటికి, రెండుసార్లు ఆలోచించి ఎలాంటి స్ఫూర్తిదాయకమైన సంస్కరణలు వ్యవసాయ(agriculture)రం గంలో చేపడితే యువత వ్యవసాయరం గంపై మెగ్గు చూపు తారో, ఆయా వ్యవసాయ నిపుణులతో చర్చించి మరీ కసరత్తు చేయాల్సిన తక్షణ కర్తవ్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలపై ఎంతైనా వుంది. ఏదిఏమైన అనాదిగా భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలలో ఒక భాగంగా వుంటూ రావడమే కాదు నిన్న, మొన్నటి వరకు ఒక వెలుగువెలిగిన వ్యవసాయ రంగం అనేక కారణాలరీత్యా, ప్రస్తుతం తీవ్ర గడ్డుపరిస్థితు లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వ్యవసాయరంగం తిరిగి పూర్వపు వైభవం దిశగా పయనించేలా, అది ప్రస్తుత, రాబో యే తరం యువతకు మంచి లాభదా యకమైన వృత్తిగా మారేలా చేయాల్సిన గురుతర బాధ్యత మాత్రం ముమ్మా టికీ మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల పెద్దలదే అనడంలో ఇసుమంతైనను సందేహంలేదు. ఏమైనాయావత్ దేశానికి పట్టేడు అన్నం పెట్టే అన్నదాతలు తమ వ్యవసాయ రంగం లో ఎలాంటి ఇబ్బందులు, ఒడిదుడుగులు, ఆటుపోట్లు, ప్రతి కూల, దయనీయ పరిస్థితులు ఎదుర్కొనకుండా పచ్చగా, సుభి క్షంగా ఉంటేనే మనదేశం అభివృద్ధి పథంలో దూసు కుపోయేది అనేమాట అక్షరసత్యం. ఇప్పటికి దేశవ్యాప్తం గా కూడా మెజారిటీ ప్రజలు ఎక్కువగా ఆధారపడేది వ్యవసాయ మీదే. కాబట్టి మన దేశ పాలకులు ఎక్కువగా వ్యవసాయరంగం మీద ఫోకస్ చేసి, యుద్ధ ప్రాతిపదికన ఆ రంగ అభివృద్ధికి పెద్దపీట వేయాలి.
-బుగ్గన మధుసూదనరెడ్డి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

agricultural reforms agriculture Breaking News Farmers issues farming sector latest news rural economy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.