ఈ మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా కూడా విచ్చలవిడిగా కల్తీ మద్యం ఏరులై పారుతూ ప్రజలప్రాణాలతో ఆట లాడుకుంటున్న విషయం మనందరికీ విధితమే. కేవలం స్పిరిట్, రసాయనాలతో తయారుచేసి, పాపులర్ బ్రాండ్లను తలపించేలా బాటిళ్లపై నకిలీలేబుల్స్ అతికించి మరీ యధే చ్చగా సరఫరా చేస్తూ కల్తీమద్యం (Adulterated liquor)తయారీదారులు ఈ మందు ప్రియులను బురీడి కొట్టిస్తూ తమ వ్యాపారాన్ని మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లేటట్లు చేసుకుంటు న్నారు అనే మాట అక్షర సత్యం. అయితే ఇది కల్తీ మద్యం (Adulterated liquor) అని తెలియని అమాయక ప్రజలు వీటిని సేవించి తమ ఆరోగ్యాన్ని చేజేతులారా పాడుచేసుకుంటున్నారు. ముఖ్యం గా కల్తీ మద్యం సేవనం మూలాన వీటిని తీసుకున్న ప్రజ లకు అవయవ వైకల్యం ప్రాప్తించడం, వారికి వినికిడి సమ స్యలు తలెత్తడం, దృష్టిలోపం ఏర్పడటం, వారి మూత్రపిం డాలు దారుణంగా దెబ్బతిని, చివరకు వారి కాలేయాలు సైతం వైఫల్యానికి గురిఅయ్యి, వారి ప్రాణాలకే ముప్పు ఏర్పడే దయనీయ పరిస్థితులు సైతం వారికి సంప్రా ప్తించడం ఎంతైనా ఈసమాజానికి సంబంధించి అత్యంత ఆందోళన రేకేత్తించే విషయం. అయితే ఇంత జరుగుతున్న ఎందుకనో రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ కల్తీమద్యం తయారీకి అడ్డుకట్ట వేయడంలో మాత్రం ఘోర వైఫల్యం
చెందుతూనే వున్నారు. అంతేకాదు ఈకల్తీ మద్యం కేసు నిగ్గు తెల్చేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ కేసును సి.బి.ఐ వారికి అప్పగించాలని కూడా వైస్సార్సీపీ గట్టిగా డిమాండ్ చేశారు. ఏదిఏమైనా ఈ కల్తీ మద్యంలో మీథాయిల్, సీసం, ఇతర విష రసాయనాలు కలవడం మూలాన వీటిని సేవించిన మద్యం ప్రియులు తీవ్ర ఆనా రోగ్యాల బారినపడి ఇటు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు, అటు వారి కుటుంబాలను సైతం వారు ఈ మద్యం వ్యసనం మూలాన అధోగతిపాలు చేయడంతో పాటు వారిని రోడ్డు మీద పడేలాచేస్తున్నారు అనేమాట అక్షర సత్యం.
Read Also: http://Bihar Elections: ముస్లిం ఓట్లపై ఆశలు లేవంటూ నలుగురికే సీట్లు కేటాయింపు
ఇక మన రాష్ట్ర ప్రభుత్వం వారైతే ‘ఆదాయమే ఏకైక పరమా వదిగా భావిస్తూ ప్రజలు ఏమైపోతే మాకేంటి’ అనే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం మూలాన మందు ప్రియుల జీవితాలు రోజురోజుకు నరకప్రాయంగా మారిపోతున్నాయి అనడంలో ఎలాంటి సందేహానికి తావు లేదు. ఏమైనా మన ప్రజలు ఇప్పటికయినా విచక్షణ జ్ఞానంతో వ్యవహరించి ‘ఈ కల్తీ మద్యం వద్దు, తమకు తమప్రాణాలే ముద్దు’ అనే నీతి నానుడికి పెద్దపీట వేసి, అంతిమంగా తమ కుటుంబాల బాగోగులు, శ్రేయస్సే తమకు ప్రధానమని తక్షణమే భావించి వారి ఆరోగ్యాలను సర్వనాశనం చేసే, గుల్ల గావించే ఈ మద్యం అనే పాడు, చెడు అలవాటుకు వీలైనంత త్వరగా గుడ్ బై చెప్పగలిగితే వారంతా ఎలాంటి ఇబ్బందుల పాలు కాకుండా వారు, వారిని నమ్ముకున్న వారి కుటుంబాలు సైతం అత్యంత సుఖ, సంతోషాలతో నిండు నూరేళ్లు
జీవించగలు గుతారు అనడంలో ఎలాంటి సందేహంలేదు. కాబట్టి ఒక్క సారి ఆలోచించుకోండి మీకు మీ ఆరోగ్యం, మీ కుటుంబ బాగుదల ముఖ్యమా ఈ మద్యం అలవాటు ముఖ్యమా? ఇక నిర్ణయం తీసుకోవడం మీ వంతు. అంటే మీరు మద్యం అనే చెడుఅలవాటుకు మంగళం పాడిమంచి మార్గం లో వెళ్లడమా లేక చెడుమార్గంలో పయనింపచేసుకోవడమా? అన్నింటికి తుది నిర్ణయం మాత్రం ముమ్మాటికీ మీదే.
-బుగ్గన మధుసూదనరెడ్డి
మాదక ద్రవ్యాలు అంటే ఏమిటి?
మాదక ద్రవ్యాలు అనగా మానవ శరీరానికి మిక్కిలి హాని కలిగించే కొన్ని పదార్ధాలు. వీటిని ప్రపంచమంతా డ్రగ్స్ అని వ్యవహరిస్తారు. మాదక ద్రవ్యాల వాడకం ఒక ప్రమాదమైన వ్యసనము (Addiction). ఈనాటి యువతరాన్ని దారి మళ్ళించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కన్నా తీవ్రమైన ప్రభావకాలు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6 శాతం జనాభా అనగా 185 మిలియన్ల మంది ఇలా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనాలు తెలుపుతున్నాయి.
మాదక ద్రవ్యాలు రకాలు ?
మాదక ద్రవ్యాలలో వివిధ రకాలున్నాయి. నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చరస్, గంజాయి, మారిజువానా, కొకైన్, ఎల్.ఎస్.డి. మొదలైనవి ముఖ్యమైనవి. మాదక ద్రవ్యాలు నల్ల బజారులో అందుబాటులో ఉంటున్నాయి. వీనికి వివిధ ప్రాంతాలలో సంకేత నామాలతో చలామణీ అవుతుంటాయి. ఇలా అక్రమ వ్యాపారాలు దొంగ రవాణాకు పాల్పడుతూ కోట్లాది రూపాయల్ని గడిస్తుంటే, యువత వానిని వినియోగిస్తూ చెడిపోయి దేశానికి ద్రోహం చేస్తుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: