Vahini Death News: క్యాన్సర్ తో పోరాడుతూ నటి వాహిని మృతి

Read Time:  1 min
Vahini Death News: క్యాన్సర్ తో పోరాడుతూ నటి వాహిని మృతి
FONT SIZE
GET APP

Vahini Death News: విజయనగరం, ఫిబ్రవరి 5 ప్రభాతవార్త: సినీ నటి వాహిని కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న ఆమె… తన స్వస్థలం విజయనగరంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సినీ నటి కరాటే కళ్యాణి వెల్లడించారు. వాహిని మృతి పట్ల సహ నటీ నటులు, సినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also:Rajini gaang movie review : రజినీ గ్యాంగ్ రివ్యూ నవ్వులా? భయమా?

విజయనగరంలో జననం – సినీ ప్రస్థానం(Vahini Death News)

48 ఏళ్ళ వాహిని విజయనగరంలో జన్మించారు. తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాల్లో కూడా ఆమె నటించారు. సహాయ నటిగా మంచి గుర్తింపు పొందారు. సహాయ నటిగా ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులను మెప్పించాయి.

బుల్లితెరపై తిరుగులేని క్రేజ్

సినిమాలతో పాటు బుల్లితెరపై ఆమె సందడి చేశారు. అనేక ప్రేక్షకాదరణ పొందిన సీరియల్స్ లో ఆమె నటించారు. సీరియల్స్ లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు. తనదైన నటనతో బుల్లితెర ప్రేక్షకులకు కూడా ఆమె ఎంతో దగ్గరయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.